ఓటమి తో ఎక్కి ఎక్కి ఏడ్చిన గెల్లు శ్రీనివాస్

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్..తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఫై భారీ మెజార్టీ తో విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్..ఎక్కడ లేని విధంగా పలు సంక్షేమ పథకాలు హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రవేశ పెట్టారు. అంతే కాదు కేవలం నాల్గు నెలలలో ఎన్నో అభివృద్ధి పనులు జరిపారు. దళిత బంద్ పథకాన్ని తీసుకొచ్చి గెల్లు శ్రీనివాస్ విజయం పక్క అన్నట్లు ప్రచారం చేయించారు. కానీ నియోజకవర్గ ప్రజలు మాత్రం ఈటెల కు ఓట్లు వేసి తమ ఆత్మాగౌరావాన్ని చాటుకున్నారు.

కాగా గెలుపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ.. ఓటమి పాలవుతున్నానని తెలిసి గెల్లు శ్రీనివాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు ఆ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. గెల్లు శ్రీనివాస్ కార్యకర్తల సమక్షంలో కన్నీటి పర్యంతం అయ్యారు. ఇప్పుడు ఆ వీడియో తెలంగాణ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్బుక్ లలో చక్కర్లు కొడుతోంది. ముఖ్య నాయకులు బీజేపీ విజయాన్ని ఎంత చిన్నదిగా చూపాలని ప్రయత్నిస్తున్నా… సగటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటమి నుంచి తేరుకోలేకపోతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రధాన నాయకులంతా టీఆర్ఎస్ పార్టీ వారే అయినప్పటికీ గెల్లు శ్రీనివాస్ ను గెలిపించలేకపోయారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ మంత్రుల, ఎమ్మెల్యేలు, స్థానికి కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు ఎంతగా ప్రచారం చేసిన బీజేపీ, ఈటెల జోరు ముందు నిలువలేక పోయారు.

YouTube video