‘గీత గోవిందం’ ఫస్ట్‌లుక్‌

GEETA GOVINDAM-1
GEETA GOVINDAM

 ‘గీత గోవిందం’ ఫస్ట్‌లుక్‌

అర్జున్‌రెడ్డి చిత్రంలో స్టార్‌డమ్‌ సంపాదించటమే కాకుండా కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న విజ§్‌ు దేవరకొండ హీరోగా చలోచిత్రంతో క్రేజీ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంటర్‌ అయిన రష్మిక మందాన్న హీరోయిన్‌గా పరశురాం (బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గీత గోవిందం.. బన్నీవాసు, నిర్మాణంలో ఎస్‌ ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో జిఎ2 పిక్చర్స్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈచిత్రానికి గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రం ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, విజ§్‌ు దేవరకొండ కెరీర్‌లో బెస్ట్‌ చిత్రం అవుతుందన్నారు. రష్మిక పాత్ర మన పక్కింటి అమ్మాయిలా ఉంటుందన్నారు. గోపీసుందర్‌ సంగీతం బాగుందన్నారు.
దర్శకుడు బుజ్జి మాట్లాడుతూ, ఈచిత్రాన్నిరొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చేస్తున్నట్టు తెలిపారు. విజ§్‌ు దేవరకొండ ఇమేజ్‌ని దృష్టిలో ఉంచుకుని పాత్రను డిజైన్‌ చేసినట్టు తెలిపారు.. బన్నివాసు మాట్లాడుతూ, గీత గోవిందం చేసే అల్లరి యూత్‌ని ఆకట్టుకుంటుందన్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామన్నారు.