రానున్న నూతన జిడిపి సిరిస్‌

్ద్దన్యూఢిల్లీ: కేంద్ర గణాంకాలు, కార్యక్రమంలో అమలు శాఖ రానున్న కొద్ది నెలల్లో కొత్త జిడిపి సిరీస్‌ను నిర్ణయించవచ్చని ఆ శాఖ కార్యదర్శి ప్రవీన్‌ శ్రీవాస్తవ అన్నారు. ప్రస్తుతం జిడిపి గణనకు మూల సంవత్సరం 2011-12 కాగా కొత్త సిరిస్‌లో అంతకన్నా తర్వాతి సంవత్సరం నిర్ణయిస్తారని, 2017-18 తమ పరిశీలనలో ఉన్నదని చెప్పారు. పరిశ్రమల వార్షీక సర్వే వినియోగవ్యయ సర్వే ఫలితాల కోసం తాము ఎదురుచూస్తున్నామని, ఆ ఫలితాల తర్వాత కొత్త మూల సంవత్సరం ప్రకటిస్తామని ఆయన తెలిపారు. దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని అభివృద్దిపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/