గౌతం గంభీర్‌పై మండిపడ్డ విరాట్‌ కోహ్లీ

gautam gambhir ,virat kohli
gautam gambhir ,virat kohli

బెంగుళూరు: ఐపిఎల్‌లో విరాట్‌ కోహ్లీ ఏమంత చురుకైన కెప్టెన్‌ కాదు. అందుకే అతను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు టీమ్‌కి ఒక్కసారి కూడా టైటిల్‌ అందించలేకపోయాడు. రెండు రోజుల క్రితం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మాజీ కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ చేసిన ఈవ్యాఖ్యలపై అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. కొందరు గంభీర్‌కి మద్ధతు తెలిపితే….మరికొందరు కోహ్లీని వెనకేసుకొచ్చారు. తాజాగా…విరాట్‌ కోహ్లీనే స్వయంగా గంభీర్‌ వ్యాఖ్యలపై స్పందించాడు. ఐపిఎల్‌ 2019 సీజన్‌ మ్యాచ్‌లలో భాగంగా శనివారం తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టు ఢీకొననుంది. అయితే, మ్యాచ్‌ ప్రారంభానికి ముందు మీడియాతో విరాట్‌ కోహ్లీ మాట్లాడుతుండగా…గంభీర్‌ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది. దీంతో…ఆర్‌సిబి కెప్టెన్‌ ఘాటుగా స్పందించాడు. ఐపిఎల్‌ టైటిల్‌ గెలవాలని నేనూ కోరుకుంటున్నాను. దానికోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నా. కానీ, కేవలం ఐపిఎల్‌ టైటిల్‌ ఆధారంగా నా సామర్థ్యాన్ని అంచనా వేయడాన్ని ఒప్పుకోన. ప్రతిసారి టైటిల్‌ గెలవాలనే కోరుకుంటా. కానీ…అన్నిసార్లు అది సాధ్యం కాకపోవచ్చు. బయిటవాళ్లలా నేనూ ఆలోచిస్తా….ఐదు మ్యాచ్‌లు కూడా ఆడకుండానే…ఇంట్లో కూర్చుంటాను. చాలా మంది ఇలా విమర్శలతో వార్తల్లో నిలవాలని కోరుకుంటున్నారని నాకు తెలుసు. కానీ…నాకంటూ ఓ బాధ్యత ఉంది. ఒక జట్టు కెప్టెన్‌గా…ఐపిఎల్‌ టైటిల్‌ను జట్టుకి అందించాలని కోరుకుంటున్నా. ఆ ప్రేరణతో ఈసారి కూడా బరిలోకి దిగుతున్నామని కోహ్లీ వెల్లడించాడు.

https://www.vaartha.com/news/sports/
మరిన్ని తాజా క్రిడా వార్తల కోసం క్లిక్‌ చేయండి :