నా చావుకు సిఎం కారణం

నా చావుకు సిఎం కారణం

కోల్‌కతా: ఓ రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి మంగళవారం రాత్రి మణికట్టు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తన చావుకు పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీయే కారణమని ఆరోపిస్తు 1986 బ్యాచ్‌కు చెందిన గౌరవ్‌ దత్‌ సూసైట్‌ నోట్‌ రాసి బలవన్మరణానికి పాల్పడ్డారుగౌరవ్‌ దత్‌ ఇటీవలే పదవీ విరమణ చేశారు. ఓ కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో ఆయనపై వేటు పడింది. 2010 నుంచి ఇటీవల పదవీ విరమణదాకా ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా ఖాళీగా ఉంచారు. గౌరవ్‌ వద్ద ఆయన సంతకం చేసిన ఓ సూసైడ్‌నోట్‌ లభించింది. అందులో నేరుగా మమత పేరును నేరుగా ప్రస్తావించకుండానే ఆమెపై ఆరోపణలు చేశారు.తనపై ఉన్న పెండింగ్‌ కేసులను కొట్టేసేందుకు పశ్చిమ బెంగాల్‌ సీఎం తిరస్కరించారని.. ఒక ఫైల్‌ను ఉద్దేశపూర్వకంగా మాయం చేశారని.. రెండో కేసులో తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రుజువు కాలేదన్నారు. పదవీ విరమణ తర్వాత పొందే ప్రయోజనాలనూ బ్లాక్‌ చేశారని లేఖలో వాపోయారు. చనిపోయేముందు సూసైడ్‌ నోట్‌ను ఆయన కొన్ని మీడియా సంస్థలకు పంపారు.