గద్వాల మాజీ ఎమ్మెల్యే మృతి

gattu bheemudu
gattu bheemudu, gadwal ex mla

జోగులాంబ గద్వాల: గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు గుండెపోటుతో మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐతే ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన 1999లో మొదటిసారి టిడిపి తరఫున పోటీ చేసి గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. గట్టు భీముడు మృతిపట్ట గద్వాల టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కృష్టమోహన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. భీముడు మృతి నేపథ్యంలో పరిషత్‌ ఎన్నికల సంబురాలకు దూరంగా ఉండాలని కార్యకర్తలకు కృష్ణమోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/