దాదాపు 3 కిలోమీటర్ల మేర గ్యాస్ లీకేజి

భోపాల్ గ్యాస్ ఘటన తలపిస్తోంది

Gas leakage area
Gas leakage area

Visakhapatnam: విశాఖపట్టణంలో ఈ ఉదయం జరిగిన భారీ ప్రమాదం  భోపాల్ గ్యాస్ దుర్ఘటనను తలపిస్తున్నది.

నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకైంది.

ఈ గ్యాస్ లీకేజి  దాదాపు మూడు కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఈ గ్యాస్ పీల్చిన వారికి  ఆ వాసనకు కడుపులో వికారం, కళ్లలో మంటలు, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తతున్నాయి. 

మరికొందరు రోడ్డుపైనే అపస్మారక స్థితిలో పడిపోయారు. కొందరు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మేఘాద్రి గడ్డవైపు పరుగులు తీయగా మరికొందరు తలుపులు వేసుకుని ఇళ్లలోనే ఉండిపోయారు.

అప్రమత్తమైన పోలీసులు సైరన్‌ మోగిస్తూ ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరించారు.

ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అస్వస్థతకు గురైన చిన్నారులు, మహిళలను ఆసుపత్రికి తరలిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం :https://www.vaartha.com/telangana/