గనిలో గ్యాస్‌ పేలుడు..నలుగురు మృతి

గనిలో గ్యాస్‌ పేలుడు..నలుగురు మృతి
gas-explosion- in-north-china-coal-mine

షాంకి: ఉత్తర చైనా షాంకి ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం సంభవించింది. లూవన్‌ గ్రూప్‌ ఆఫ్‌ సంస్థకు చెందిన బొగ్గు గనిలో మంగళవారం తెల్లవారుజూమున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్యాస్‌ పేలుడు సంభవించి నలుగురు దుర్మరణం చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. కార్మికులు, స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఏడాదికి సుమారు 1.2 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి స్థామర్యం ఈ గనికి ఉందని వారు పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/