బుకింగ్‌ చేసుకున్న రోజే గ్యాస్‌ సిలిండర్‌

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ రెడీ

Gas cylinder on the day of booking-ioc
Gas cylinder on the day of booking-ioc

Mumbai: ఇండేన్‌ గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త. గ్యాస్‌ బుకింగ్‌ చేసుకున్న మొదటి రోజే వంట గ్యాస్‌ డెలివరీ చేసే విధంగా సేవ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఒసి).

ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో ఒక నగరం లేదా జిల్లాకు తత్కాల్‌ ఎల్‌పిజి సేవ లు ప్రారంభానికి గుర్తించి, ఈ తత్కాల్‌ పథకం సేవల కింద బుక్‌ చేసుకున్న అర గంట లేదా నలభై ఐదు నిమిషాల్లో కస్టమర్‌కు గ్యాస్‌ డెలివరీ చేయనున్నట్లు ఐఒసి అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ సేవలను ఖరారు చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 1వ తేదీనాటికి తత్కాల్‌ వంట గ్యాస్‌ సేవలను ప్రారంభించాలని భావిస్తున్నారు.

ఇండేన్‌ బ్రాండ్‌ ద్వారా ఐఒసి వంట గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేస్తోంది. కేంద్రం నినాదం సులభతర జీవ నం మెరుగుపరచడంలో భాగంగా దీనిని అందించనున్నట్లు తెలిపారు.

మొత్తం 28 కోట్ల డొమెస్టిక్‌ ఎల్‌పిజి కన్జ్యూమర్లలో ఇండేన్‌గ్యాస్‌ 14 కోట్ల మంది కస్టమర్లకు సేవ లు అందిస్తోంది. 2010లోను నాటి మంత్రి ఎల్‌పిజిడెలివరీ స్కీమ్‌ ను ప్రారంభించారు. ఈ స్కీం ప్రకారం కస్టమర్‌గ్యాస్‌ సిలిండర్‌ను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9గంటల వరకుసప్లై చేసే లా డిమాండ్‌ చేయ వచ్చు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/