‘పుష్ప’ పై ‘గరికపాటి’ ఫైర్

స్మగ్లింగ్ చేసే హీరో ‘తగ్గేదేలే ‘ అంటాడా ?

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు తాజాగా ‘పుష్ప’ సినిమా మేకర్స్ పై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాల గురించి మాట్లాడుతూ ‘పుష్ప’ పై మండిపడ్డారు. ”సినిమాల గురించి మనకు తెలుసు. రౌడీ – ఇడియట్.. నిన్నగాక మొన్న వచ్చిన ‘పుష్ప’.. ఇందులో హీరోను ఒక స్మగ్లర్ గా చూపించారు. ఏమన్నా అంటే తర్వాత ఎప్పుడో చివర్లో మంచి చూపిస్తాము.. లేదా ఎప్పుడో నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాం అంటారు. మీరు రెండు మూడు భాగాలు తీసే లోపు సమాజం చెడిపోవాలా?. పైగా స్మగ్లింగ్ చేసేవాడు ‘తగ్గేదే లే’ అంటాడా? అంటూ ఫైర్ అయ్యారు. అసలు ‘తగ్గేదే లే’ వంటి డైలాగ్ ను శ్రీరాములు లాంటివారు వాడాలి.. హరిశ్చంద్రుడి వంటివారు వాడాలి. ఒక స్మగ్లర్ అలాంటి డైలాగ్ వాడడం ఏంటండి? అని పేర్కొన్నారు. ఈ డైలాగ్ వల్ల సమాజంలో నేరాలు పెరుగుతున్నాయన్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/