పార్టీ మారే ప్రసక్తే లేదు, గంటా క్లారిటీ

ganta srinivasarao
ganta srinivasarao

విశాఖపట్నం: మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టిడిపికి గుడ్‌బై చెప్పి బిజెపిలో చేరుతున్నారని, ఆయనతో పాటు మరో 15 మంది ఎమ్మెల్యేలు జంప్‌ అవుతున్నారని, పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే ఈ వార్తలపై గంటా క్లారిటీ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఉత్తర నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశమయ్యారు. తాను పార్టీ మారుతానంటూ మీడియాలోనే ప్రసారం చేసుకుంటున్నారని, ఆ వార్తలకు తనకు ఎలాంటి సంబంధం లేదని , ఎన్నికల ముందు తర్వాత కూడా చాలా సారుల పార్టీ మారుతున్నానంటూ కథనాలు వచ్చాయన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదని, ఆ అవసరం కూడా తనకు లేదని గంటా ఈ సమావేశంలో కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చేశారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/