ఏపి డీఎస్సీ ఫలితాలు

ganta srinivasa rao
ganta srinivasa rao, ap minister

రాజమండ్రి: ఏపిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మెరిట్‌ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఫలితాలను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. మొత్తం 7902 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు 6,08,155 మంది దరఖాస్తు చేయగా..5,05,547 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలు, సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాను ప్రకటించారు. ఎంపికైన అభ్యర్ధులు మే 15న నియమక పత్రాలు అందజేయనున్నామని..వారికి 10 రోజుల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు.