ఆ ఆలోచనే లేదని చెప్పిన గంటా

Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao

అమరావతి: గత కొన్ని రోజులుగా టిడిపి నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టిడిపిని వదిలిపెట్టనున్నారనే వార్తలు కాస్త గట్టిగానే వినిపించిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై గంటా మాట్లాడుతూ.. తాను టిడిపిలోనే కొనసాగుతానని, పార్టీ మారే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయి సమావేశాలను టిడిపి అధినేత చంద్రబాబు ఆదేశానుసారం నిర్వహించబోతున్నానని తెలిపారు. అంతేకాకుండా ఈ వార్తలు నిజం కాదని, ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు గంటా బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారు అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సిపిలోకి కూడా వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే విశాఖకు చెందిన మంత్రి ఈ విషయంపై తీవ్ర వ్యతిరేకత కారణంగా ఈ ప్రయత్నానికి కళ్లెం పడిందనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/