తన రాజీనామా పై మరోసారి స్పీకర్ కు లేఖ రాసిన గంటా

Ganta Srinivasa Rao
The hour he wrote a letter to the Speaker once again on his resignation

అమరావతి: స్పీకర్ తమ్మినేని సీతారాంకి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన రాజీనామాను ఆమోదించాలని కోరుతూ..లేఖ రాశారు. 2021 ఫిబ్రవరి 12న తాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శాసన సభ్యుతవానికి గంటా రాజీనామా చేశారు. అయితే ఏడాది దాటినా తన రాజీనామాను ఆమోదించకపోవడం పై ఆవేదన చెందుతున్నట్లు లేఖలో గంటా పేర్కొన్నారు. ఏడాదికాలంగా పోరాడుతోన్న నిర్వాసితుల, కార్మికుల పోరాటాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధను కలిగించిందన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని గంటా రాసుకోవచ్చాడు.

దేశ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గంటా శ్రీనివాస్, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనే స్పీకర్‌కు స్వయంగా రాజీనామా లేఖ రాశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజకీయేతర జేఏసీని ఏర్పాటు చేస్తానని ఆయన అప్పట్లో ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా పోరాటం చేస్తానన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/national/