తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ తో వంశీ భేటీ

cm jagan & vallabhaneni vamsi
cm jagan & vallabhaneni vamsi

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌తో గన్నవరం ఎమ్మెల్యె వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యలయంలో సీఎంతో వంశీ సమావేశమయ్యారు. మంత్రి కొడాలి నానితో కలిసి ఆయన జగన్‌ను కలిశారు. ఈ సమావేశంలో పలు తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో జగన్‌- వంశీ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలయ్యింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిచేందుకు వంశీ సీఎం సమావేశమైనట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశం కూడా ఈ భేటీలో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. కాగా ఇటీవల చంద్రబాబు ఇసుక కొరతపై దీక్ష చేస్తున్న రోజే వంశీ ప్రెస్‌మీట్‌ పెట్టి చంద్రబాబు, లోకేష్‌లపై పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాగా గత కొన్ని రోజులుగా సైలెంట్‌ అయిన వంశీ తాజాగా సీఎంతో భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/