దేశానికి ఉత్తమ జట్టుని అందివ్వాలి

సెలక్షన్‌ కమిటీపై గంగూలీ అసంతృప్తి

Sourav Ganguly
Sourav Ganguly

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలి వెస్టిండీస్‌ పర్యటనకు బీసీసీఐ సెలక్షన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అన్ని ఫార్మాట్‌లకు ఒకే ఆటగాళ్లను ఎంపిక చేసే సమయం సెలక్షన్‌ కమిటీకి ఆసన్నమైంది. దీని వల్ల ఆటగాళ్లు మరింత విశ్వాసంతో రాణిస్తారు. శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇవ్వకపోవడం, అజింక్య రహానెను టెస్టులకు మాత్రమే పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. సెలక్షన్‌ కమిటీ మొత్తం మూడు ఫార్మాట్‌ల్లో ఒకే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని, అందరినీ సంతోషపరచడానికీ జట్టుని ఎంపిక చేయరాదని కేవలం కొంతమంది ఆటగాళ్లు మాత్రమే మూడు ఫార్మాట్‌ల్లో ఆడుతున్నారు. గొప్ప జట్లలో ఆటగాళ్లు స్థిరంగా ఉంటారు. అందర్నీ సంతోషపరచడానికి జట్టును ఎంపిక చేయకూడదు. దేశానికి ఉత్తమ జట్టుని అందివ్వాలి.’ అని బీసీసీఐని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు. 


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/