మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గంగుల కమలాకర్

హైదరాబాద్ : పౌరసరఫరాలు, బిసి సంక్షేమ శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ గురువారం బాధత్యలు స్వీకరించారు. ఖైరతాబాద్‌లోని బిసి కమిషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కమలాకర్ ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అభినందించి , శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని కమలాకర్ పేర్కొన్నారు. తనకు అప్పగించిన రెండు శాఖల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని, కెసిఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానని ఆయన పేర్కొన్నారు. రేషన్ సరుకులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా చర్యలు తీసుకుంటానని కమలాకర్ స్పష్టం చేశారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/