మెగాస్టార్ కు తల్లి గా గంగవ్వ..?

మెగాస్టార్ కు తల్లి గా గంగవ్వ..?

గంగవ్వ..ఈమె తెలియని తెలుగువారు లేరనే చెప్పాలి. షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయినా ఈమె..ఆ తర్వాత సినిమా ఛాన్సులు మాత్రమే కాదు బిగ్ బాస్ ఛాన్స్ కూడా కొట్టేసి చాల పాపులర్ అయ్యింది. ప్రస్తుతం వచ్చిన చాన్సుకల్లా ఓకే చెపుతూ రాణిస్తుంది. కాగా ఈమెకు ఇప్పుడు మెగా ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి – మోహన్ రాజా కలయికలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ లో చిరంజీవి కి తల్లి గా గంగవ్వ నటిస్తున్నట్లు వినికిడి. ప్రస్తుతం గంగవ్వ కూడా ఊటీ లో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మలయాళ పొలిటికల్ బ్లాక్ బస్టర్ మూవీ “లూసిఫర్”కు రీమేక్ గా రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు ఎన్‌వి ప్రసాద్, ఆర్‌బి చౌదరి సంయుక్తంగా రామ్ చరణ్‌తో కలిసి నిర్మిస్తున్నారు. థమన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నాడు. చిరంజీవి పుట్టినరోజున టైటిల్ ను రివీల్ చేయగా, సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.