గంగావతరణం

ఆధ్యాత్మిక చింతన

Gangavataranam
Gangavataranam

పూజాది కార్యక్రమాల్లో నీటిలో సకల తీర్థజలాలు ఆవాహన చేసే సమయంలోను గంగ ప్రధానమై ఉంటూ అగ్రతాంబూలాన్ని అందుకుంటుంది.

గంగ స్వయంగా విష్ణుపాదోద్భవ గంగావతరణకు మూలకారకుడు భగీరథుదు. సగరుని కొడుకు అసమంజసుడు. అతని కుమారుడు అంశుమంతుడు. సగరుడు అశ్వమేధ యాగాలు చేస్తూ ఉండేవాడు.

ఒకసారి అశ్వమేధయాగం చేసిన తరువాత తనకు సుమతియందు కలిగిన అరవై వేల మంది పుత్రులను యాగాశ్వం వెంటనే పంపించాడు.

వీరు ఆ అశ్వం వెంట వెళుతుండగా సముద్రతీరంలో అకస్మాత్తుగా అశ్వం అదృశ్యమైపోయింది. దీనికి కారణం ఉంది.

సగర పుత్రుల ఆగడాలను తట్టుకోలేక దేవతలు బ్రహ్మను ప్రార్థించిన మీదట విష్ణ్వంశసంభూతుడైన దేవతలు బ్రహమను ప్రార్థించిన మీదట.

విష్ణ్వంశ సంభూతుడైన కపిలుని ద్వారా సగరపుత్రులు మరణిస్తారని బ్రహ్మ అభయమిచ్చాడు.

దాంతో ఇంద్రుడు వాయువును పిలిచి యాగాశ్వాన్ని కపిలుని ఆశ్రయించి కట్టివేయమని ఆజ్ఞాపించాడు.

అందువల్ల సగరపుత్రులకు ముందర యాగాశ్వం కనిపించలేదు. వారు వెతికి వెతికి విసిగి వేసారి చివరకు తండ్రి దగ్గరకు వచ్చి అశ్వం కనిపించలేదని చెప్పారు.

సగరుడు యాగాశ్వాన్ని తీసుకుని రాకుండా వస్తే నగరంలోకి రానీయనని కఠినంగా చెప్పాడు.

సముద్రతీరంలో కనిపించకుండా పోయిన అశ్వాన్ని వెతుకుతూ సగరపుత్రులు సముద్రంలోనే అశ్వం ఉందేమోనని అనుకుంటూ సముద్రాన్ని తవ్వడం మొదలుపెట్టారు.

చివరకు రసాతలంలో కట్టివేయబడిన ఉన్న గుర్రాన్ని చూశారు. కపిలుడే ఆ అశ్వాన్ని అపహరించి ఉంటాడనుకున్నారు.

తపస్సు చేసుకుంటున్న కపిలునికి వీరి రాకతో తపోభంగమైంది. కోపంతో కళ్లు తెరచి చూడగా ఆ కోపాగ్నికి సగర పుత్రులు మాడి మసి అయిపోయినారు.

అప్పుడు అసమంజునుని పుత్రుడైన అంశుమంతుడు రాజైనాడు. ఇతని కుమారుడు భగీరథుడు.

ఇతడు తన పూర్వీ కులైన సగర పుత్రుల వృత్తాంతాన్ని విని చింతించి ఎలాగయినా వారిని ఉద్ధరించాలని నిశ్చయించుకున్నాడు. బ్రహ్మను ఆరాధించాడు. బ్రహ్మను గురించి, గంగ గురించి తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నది.

నాతో కలిసి భూలాోకానికి రమ్మని ప్రార్థించాడు. గంగ ఒప్పుకుంది. కానీ తన వేగాన్ని భరించగలవాడు శివ్ఞడు మాత్రమేనని చెప్పింది.

అప్పుడు భగీరథుడు శివుని ప్రార్థించి అనుగ్రహాన్ని పొంది గంగను శివుడు భరించేలా వరాన్ని పొందాడు.

శివ్ఞడు గంగ ప్రవాహవేగాన్ని భరించేందుకు సిద్ధపడ్డాడు. గంగ ఆకాశన్నుండి శివ్ఞని శిరస్సుపైకి చేరుకుంది. అక్కడ శివ్ఞని జటాజూటం నుండి కిందకు జారింది.

భగీరథుడు గంగను సరగపుత్రులు భస్మమైపడి ఉన్న చోటుకు తీసుకునిపోసాగాడు.

మార్గమధ్యలో జహ్నుమహర్షి ఆశ్రమం ఆ గంగలో మునిగిపోయింది. దాన్ని చూసిన జహ్నవ్ఞ కోపించి గంగను పీల్చి పుక్కిటపట్టాడు.

భగీరథుడు జుహ్నుమహర్షిని వేడుకొన్నాడు. అప్పుడు గంగ జుహ్నువ్ఞ చెవిలో నుండి వెలుపలికి వచ్చింది.

వచ్చింది. అందుకే జుహ్నువిగా పిలబడుతోంది. అక్కడ నుండి సగరపుత్రులు భస్మమైన చోటుకు తీసుకుని వెళ్లాడు భగీరథుడు.

ఈ పవిత్రజలంతో సగరపుత్రులు స్వర్గానికి చేరుకున్నారు. సాగరాలు జలంతో నిండాయి.

ఆ విధంగా గంగ భగీరథ ప్రయత్నంలో భువికి అరుదెంచింది. అందువల్ల భాగీరథిగా పిలువబడుతోంది.

మూడు మార్గాల్లో పయనించి వచ్చిన గంగ త్రిపథగ అయింది. పరమ పునీతమైన పూజనీయమైంది.

ఎవరి హృదయంలో అయితే గంగపట్ల భక్తిభావం ఉంటుందో వారికి సదా సుఖము, ముక్తి సిద్ధిస్తాయి. గంగ ముక్తి ప్రదాయిని.

– ఉలాపు బాలకేశవులు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/