గుంటూరు జిల్లాలో ఘోరం : మహిళపై సామూహిక అత్యాచారం..కేసును నిరాకరించిన పోలీసులు

రాష్ట్రంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఓ దగ్దర ఘటన మరచిపోయేలోపే మరోచోట అత్యాచార ఘటన వెలుగులోకి వస్తుంది. తాజాగా గుంటూరు జిల్లాలో మహిళపై సామూహిక అత్యాచారం సంచలనం రేపుతోంది.

సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరు నగరంలో ఓ పెళ్లికి హాజరై బైక్‌పై వస్తుండగా మేడికొండూరు అడ్డురోడ్డు సమీపంలో దంపతులను కొందరు దుండగులు అడ్డగించి భర్తపై దాడి చేసి…భార్యను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై బాధితులు పిర్యాదు చేసేందుకు అర్ధరాత్రి సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా.. ఫిర్యాదు తీసుకునేందుకు అక్కడి పోలీసులు నిరాకరించారు.

ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్‌ ఎస్పీ పరిధిలోకి వస్తుందని.. తమ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి రాదని చెప్పి పంపించారు. దీంతో స్థానికులు పోలిసుల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన ఎక్కడ జరిగినా ముందు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును తీసుకోవాలి కావాలి కదా..ఆలా తీసుకోకుండా వెనక్కు పంపించడం ఏంటి అని ప్రశ్నింస్తున్నారు. ఇలాంటి పోలీసులు ఉండడం వల్లే స్థానికులు కేసులు పెట్టేందుకు రావడం లేదని వాపోతున్నారు.