గణేశ్‌ విగ్రహాల ప్రతిష్ఠాపనకు అనుమతి తేదీల ఖరారు

ganesh statue
ganesh statue

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ గణేశ్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని, ఇందుకు నగర ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు అదనపు సిబ్బందితో పోలీసు బందోబస్తు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొన్ని సూచనలు జారీ చేశారు. సెప్టెంబర్‌ 2 నుంచి 12 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల సందర్భంగా బాణసంచా పేల్చడం… వాటిని ఇతరుల మీదికి విసరేయడం లాంటి చర్యలను పూర్తిగా నిషేధించారు. బాణసంచా పేల్చడంపై ఉత్సవాలు సాగే… సెప్టెంబర్‌ 2 ఉదయం 6 నుంచి 12 సా యంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. గణేశ్‌ విగ్రహాలు ప్రతిష్ఠించాలనుకునే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. ముందుగా పో లీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రతి డివిజన్‌లోనూ, ప్ర తి విగ్రహానికీ ఏసీపీ కార్యాలయం నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలి. దానికి సంబంధించి అనుమతి కోరే పత్రాలు ఈ నెల 22 నుంచి 26 వరకు అన్ని పోలీ్‌సస్టేషన్లలో అందుబాటులో ఉంటాయని సీపీ తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలు ఈనెల 29 లోపు సమర్పించాలన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/