‘నిమజ్జనం’ ఎందుకు చేస్తారు ?

ఆధ్యాత్మికం

Ganesh Nimajjanam -file Photo

విఘ్నేశ్వరుడు అంటే విజ్ఞాలకు నాయకుడు.. విజ్ఞ గణాలను ఆయన తన ఆధీనంలో ఉంచుకుని భక్తుల అవిజ్ఞాలను తొలగించి శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు. త్రిమూర్తుల తర్వాత విశేషంగా పూజలందుకునే దైవం వినాయకుడు. ఏ కార్యక్రమం అయినా, పూజ అయినా నిర్విఘ్నంగా పూర్తి కావటానికి విఘ్నేశ్వర పూజతోనే ఆరంభం అవుతుంది.. ప్రతి శుభ కార్యంలో తొలిసారిగా ఆరాధింపబడే దైవమైన వినాయకుడు భాద్రపద శుక్ల పక్షంలోని నాలుగు రోజున చతుర్థినాడు జన్మించినట్టు పురాణాలు చెబుతుండటం తో ఆ రోజును వినాయక చవితిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది… గణపతి వాహనం మూషికం.. ఈ వాహనానికి ఓకే ప్రత్యేకత వుంది.. మన ఇళ్లల్లో ఉన్న పదార్ధాలను మూషికం ఎలా కాజేస్తుందో.. అలాగే విఘ్నేశ్వరుడి వాహనం అయిన ఎలుక జీవుల హృదయంలో ఉన్న అజ్ఞానాన్ని అపహరిస్తుంది.. కాబట్టి మూషికాన్ని ఆయన తన వాహనంగా చేసుకున్నట్టు పూరాణాలు చెబుతున్నాయి.. గణపతికి సర్వాంతర్యామి ఆయిన శివుడి మూషిక రూపం ధరించాడని చెబుతారు.. వినాయకుడికి గజవదనం , చాటల్లాంటి చెవులు , చిన్న కళ్ళు కల్గిన ఆయన సర్పాలను ఆభరణాలుగా కల్గి ఉంటాడు .

గణనాథునికి చిరు నేత్రాలు సూక్ష్మబుద్దికి సూచకంగా చెప్పారు.. ఏ దిక్కు నుండి పిలిచినా వారి మొర విని ఆదుకునే వినాయకుడిని పూజిస్తే సర్వ విఘ్నాలు తొలగి , సకల విద్యలు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.. దేవతల్లో అగ్రగణ్యుడైన గణపతిని అర్చించి నట్టయితే , వారికి ఆ స్వామి అనుగ్రహం లభించి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుందని ఆంటారు.. ఇక వినాయక చవితి నాడు ప్రతి వీధిలోనూ వినాయక విగ్రహాలను ప్రతిష్టించి , తొమ్మిది రోజులపాటు పూజించి ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు.. ఈ నిమజ్జనానికి ఒక కారణం వుంది.. యంత్ర ప్రతిష్ట జరగనందున తాత్కాలికంగా ప్రతిష్టించిన విగ్రహాల రూపురేఖల్లో మార్పులు వచ్చి దోషం ఏర్పడుతుంది.. కాబట్టి నిమజ్జనం చేయాలని శాస్త్రం చెబుతోంది.. అప్పటివరకు 9 రోజులపాటు ఏంటో వైభవంగా పూజలందుకున్న వినాయక విగ్రహాలు నీటిలో వదలగానే రూపు రేఖలు కోల్పోయి నీటిలో కలిసిపోతాయి.

-కాయల నాగేంద్ర

తెలంగాణ తాజా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/