ఓయీ గణాధిప నీకు మొక్కెదం

ganesh
ganesh

ఓయీ గణాధిప నీకు మొక్కెదం

ప్రధమ దేవుడు ప్రధాన దేవుడు గణపతి. ఏ కార్యానికైనా అది భౌతికరంగం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన కావచ్చు. వాటి అవరోధాలను తొలగించి సిద్ధినీ, బుద్ధి (సమృద్ధి)నీ ప్రసాదించే దివ్యశక్తినే ‘గణపతిగా ఉపాసించడం వేదప్రదాయం. గణపతి తన శక్తులతో యజ్ఞస్థలానికి విచ్చేసి, అఖండైశ్వర్యాలను ప్రసాదించే దైవ’మని గణనాం త్యా… అనే ప్రధాన వేదమంత్రానికి ఆంతర్యం. యజ్ఞం లోకకళ్యాణ కృత్యం. ఆ యుగాదులలో ఆరాధించే దేవతాగణానికీ, మంత్ర సమూహానికీ, యజ్ఞీకుల బృందానికీ ప్రభువై ఫలప్రదాతమై అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి, వేదమంత్రా లకు ‘ప్రణవం (ఓంకారం) ఆదిగా ఉన్నప్పుడే ఆమంత్రం శక్తిమంతమవుతుంది.

మంత్రాలకు పతివంటిది ఓంకారం. మంత్రాలే గణాలు, ఓంకారమే గణపతి. గణపతి సృష్టికి ముందు, సృష్టి తర్వాత ప్రళయానంతం కూడా సత్య స్వరూపుడై ప్రకాశించేవాడు. లక్ష్మీగణపతిగా, విద్యాగణపతిగా, సిద్ధిగణపతిగా, తాండవగణపతిగా, సింధూర గణపతిగా, ఏకదంతునిగా అనేకానేక ప్రకాశములతో భక్తులను అనుగ్రహిస్తాడు. ఆయనను స్మరిస్తే, ధ్యానిస్తే, పూజిస్తే సర్వారిష్టాలు తొలగి సర్వజయాలు కలుగుతాయి. ‘ఆదౌ పూజ్యోగణాధిపః సర్వకార్యములందు తొలిపూజలందువాడు. అట్టి గణపతి సంపూర్ణ వివరణలు అవతార ప్రాశస్త్యం గణేశపురాణమందు నిర్ణయించబడింది. బ్రహ్మాండమునకు ప్రధాన దేవతగా వెలుగొందినవాడే గణపతి. గణానాంపతి ‘గణపతి అని వ్ఞ్యత్తత్పి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మపదాది తత్త్వాలకు ఆయన అధిపతి కాబట్టి గణపతి అయ్యాడు.

సమస్త చేతన, అచేతన వర్గాలకు ఆయనే అధిపతి. ప్రతి కార్యారంభంలోనూ విఘ్నేశ్వరపూజ జరుపుతూనే వ్ఞన్నా భద్రపద శుద్ధి చవితినాడు వినాయకుని ప్రత్యేకంగా పూజించడంలో ప్రత్యేకత ఆరోజు వినాయకుడు జన్మించడమేగాక ఆనాడే ఆయనకు విఘ్నరాజత్వం సంప్రాప్తించడం, అందువల్ల వినాయక చవితి విశిష్ట పర్వదినంగా వినుతికెక్కింది. గణపతి ఆరాధనకు సంబంధించిన ఆధ్యాత్మిక వివరాలు అనేకం మన పురాణాలలో వేదవాజ్మయంలో నిక్షిప్తం చేయబడ్డాయి. వేదాలలో వర్ణితమైన విఘ్ననాయకుని దైవత్వం పురాణాలలో శాఖోపశాఖలుగా విస్తరించి వికాసం పొందింది. పదార్థాన్ని పెంచి పోషించి ప్రసాదించే పురాణాలు ప్రామాణికంగా పరిగణించబడు తున్నాయి. గణపతి జన్మ గురించి అనేక పురాణగాధలు ఉన్నాయి. స్కంధ, వామన, పద్మపురాణాలు, శివరహస్యం, లైత్తిరీయోపనిషత్తు గణపతి గజ ముఖుడుగానే జన్మించినట్లు చెబుతున్నాయి.

శివపురాణం, వరాహపురాణం, బ్రహ్మవైవర్తపురాణాల్లో గణపతి జన్మకు సంబంధించి విచిత్రమైన గాథ ఎన్నో ఉన్నాయి. బౌద్ధంలోనూ గణపతి ఆరాధన ఉంది. బుద్ధుడికి వినాయకుడు అనే పేరు ఉంది. గణపతికి ఎలకే కాకుండా నెమలి, సింహం, సర్వం కూడా వాహనాలు అని ముద్గల పురానం పేర్కొన్నది. మాత్సర్యానికి సింహం, అహంకారానికి నెమలి, మమకారానికి సర్పం, లోభి మోహాలకు ఎలుక విధ్వంసకారులు సంకేతిస్తారు. సుందర సుగంధ పుష్పపత్రాలెన్నో ఉండగా వినాయకుడిని దుర్వాంకురాల (గరిక)తో పూజిస్తేనే సంతుష్టుడవ్ఞతాడని అంటారు. వినాయకుడి పూజకు మట్టి విగ్రహాన్ని వాడడం శ్రేష్టం. గంగలోని మట్టితో విగ్రహం చేసి వినాయక చతుర్థినాడు పూజించి మర్నాడు మళ్లీ ఆ గంగలోనే కలపాలి. ఆ విధంగా సంవత్సరానికోసారి గంగాదేవిని గౌరవించుకుంటాననీ గణపతి దేవతలతో అన్నాడట. కనుక మట్టితో చేసిన విగ్రహాన్ని పూజిస్తేనే కార్యసిద్ధి. చవితి మర్నాడు శుక్ర లేక మంగళవారం అయితే మాత్రం రెండోరోజు కాకుండా మూడోరోజు స్వామిని నిమజ్ఞనం చేయాలి.

వినాయకుని పూజతో ధ్యనమ్‌, అవాహనమ్‌, పంచామృతస్నానమే, క్షీరసమర్పణ, దధి సమర్పణ, ఆజ్యసమర్పణ, శర్కర సమర్పణ, ఫలోదక సమర్పణ, వస్త్ర సమర్పణ, యజ్ఞోపతీత సమర్పణ, గంధసమర్పణ, ఆభరణ ్క సమర్పణ, సింధూర సమర్పణ, రక్తాక్షి సమర్పణ, ధూపసమర్పణ దీప సమర్పణ, దక్షిణ సమర్పణ, ఫల సమర్పణ, తాంబూల సమర్పణ, దక్షిణ సమర్పణ చేయాలి. తరువాత నీరాజన, మంత్ర పుష్ప సమర్పణానంతరం వాయనం ఇచ్చి అనంతరం ఉద్వాసన చెప్పి, ఆచమనం చేస్తారు. సూర్యుడు నమస్కారప్రియుడు, విష్ణువ్ఞ అలంకార ప్రియుడు గణపతి తర్పణ ప్రియుడు మహాగణపతికి ప్రియమైన చతురావ్ఞత్త తర్పణం అనుష్టించడం వల్ల ఆయుష్ణు, బుద్ధి, యశస్సు, కవిత్వం, ఐశ్వర్యం, బలం, భుక్తి, ముక్తి, యుక్తి చేకూరుతాయి. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్నయని గణీశుని రూపం బోధిస్తుంది.

భూప్రదక్షిణం ముందుగా చేసిన వాళ్లకు గజాధిµపత్యం ఇస్తానని పరమేశ్వరుడనగా తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి భూప్రదక్షిణ ఫలాన్ని పొంది గజాధిపతి అయ్యాడు. ఇది ఆయన సూక్ష్మ దృష్టికి తార్కాణం. ఏపండక్కి లేనటువంటి చిన్న బెదిరింపులాంటి విశేషం ఉంది వినాయక చవితికి, వినాయకుడికి పూజ చేసుకొని వ్రతకథ చదివి లేక విని అక్షింతలు తలపై వేసుకోక పోయినట్లయితే రాత్రి చంద్రుడిని చూస్తే నీలాపనిందలు కలుగునని ఆయన నమ్మకం. నిజంగా దైవభక్తి ఉన్నా లేకపోయినా ప్రతి ఆది వినాయక చవితికి ఆబాలగోపాలం పూజ చేస్తారు. వినాయక చవితికి మనం చేసే పూజలో నమ్మకమే కాదు. ఆరోగ్య సూత్రాలు కూడా ఉన్నాయి.

మామూలుగా ఏ దేవ్ఞడినైనా పువ్ఞ్వలతోనే పూజిస్తాం. వినాయకుడిని పువ్వలతో పాటు పత్రాలతో పూజిస్తాం. వినాయకుని మండపానికి కట్టి పాలవెల్లికి నేరేడు, మారేడు, సీతాఫల, జామ వంటి కాయలే కాక మొక్కజొన్న వంటివి కూడా వేలాడదీస్తాం. అలాగే, మనం పూజ చేసే ఆకులు, పత్ర మొదలైనవి కూడా ఆరోగ్యప్రదమైనవే. వాటి నుంచి వచ్చే ఒక విధమైన వాసన (సువాసన)తో శ్వాససంబంధమైన వ్యాధులు నయమవ్ఞతాయి. విఘ్నేశ్వరుని పూజించడానికి మనం పాటించే నియమనిష్టలు కూడా మనకు ఆరోగ్యాన్ని చేకూర్చేవే. గణపతికి నువ్ఞ్వలతో కూడిన లడ్డులంటే కూడా ఎంతో ఇష్టమట. ఆంజనేయుడిలాగే, విఘ్నేశ్వరుడికి కూడా సింధూరం అంటే ఇష్టం. దాంతో పూజిస్తే కోరిన కోర్కెలన్నీ నెరవేరతాయని ప్రతీతి.

– వనిత విజయకుమార్‌ ద్యాప