గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో కరోనా బారినపడుతున్న మెడికల్ విద్యార్థులు

దేశ వ్యాప్తంగా కరోనా మూడో వేవ్ కొనసాగుతుంది. పదులు, వందలు , వేలు దాటి ఇప్పుడు ప్రతి రోజు లక్షల సంఖ్యలో కొత్త కరోనా కేసులు పుట్టుకొస్తున్నాయి. రెండు డోసుల వాక్సిన్ లు వేసుకున్నప్పటికీ కరోనా బారినపడుతుండం అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటె ఇక కరోనా బాధితులను కాపాడాల్సిన డాక్టర్స్ , వైద్య సిబ్బంది సైతం పెద్ద ఎత్తున కరోనా బారినపడడం..బాధితులకు ఇబ్బంది గా మారింది. తాజాగా హైదరాబాద్ లోని గాంధీ , ఉస్మానియా ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్య లో డాక్టర్స్ , మెడికల్ విద్యార్థులు కరోనా బారినపడ్డారు. దీంతో వారిని క్వారంటైన్ కు తరలించిన అధికారులు చికిత్స అందిస్తున్నారు.

గాంధీ ఆస్పత్రి అనుబంధ సంస్థ మెడికల్ కళాశాలో 20 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు,10మంది హౌస్ సర్జన్లకు,10మంది PG విద్యార్థులకు, నలుగురు ఫ్యాకల్టీకి కోవిడ్ పోసిటివ్ గా నిర్ధారణ అయింది. గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ప్రాక్టీస్ చేస్తున్న విద్యార్థుల్లో 44 మంది కరోనా భారిన పడ్డారు. అలాగే ఉస్మానియాలోని 19 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు 35 మంది హౌస్ సర్జన్లు,23 మంది జూనియర్ డాక్టర్లకు మరియు ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు కరోనా సోకింది. ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 79 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా సోకిన వారిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇలా రెండు పెద్ద ఆసుపత్రిలలో పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది కరోనా బారినపడడం తో రోగులకు వైద్య చికిత్స ఇబ్బంది గా మారింది.