గాడ్సేను ఉగ్రవాది అన్న వారికి గట్టి గుణపాఠం చెప్పాలి

Sadhvi Pragya Singh Thakur
Sadhvi Pragya Singh Thakur

హైదరాబాద్‌: మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సే దేశభక్తుడు అని ప్రజ్ఞాసింగ్‌ థాకూర్‌ తెలిపారు. భోపాల్‌ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞా ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. గాడ్సే దేశభక్తుడు అని, ఆయన దేశభక్తుడిగానే ఉంటాడని, అతన్ని ఉగ్రవాదిగా పిలుస్తున్నవారు తమను తాము విశ్లేషించుకోవాలని ప్రజ్ఞాసింగ్‌ థాకూర్‌ తెలిపారు. గాడ్సేను ఉగ్రవాది అన్న వ్యక్తులకు ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాలని ఆమె చెప్పారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/