ఆటలు మళ్ళీ మొదలు అవుతాయి

ముందు ప్రజలు సురక్షితంగా ఉండాలి

brendon meccullum
brendon meccullum

వెల్లింగ్‌టన్‌: కోవిడ్‌-19 వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచంలో జరుగుతున్న క్రీడా టోర్నీలు అన్ని ఎక్కడిక్కడే రద్దు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజీలాండ్‌ మాజీ క్రికెటర్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ క్రీడలు అన్ని తిరిగి ప్రారంభమవుతాయని, అంతకు ముందు ప్రజలు సురక్షితంగా ఉండాలని, వైరస్‌ ప్రభావం ఎంత దారుణంగా ఉన్నప్పటికీ అందుకు సరిపడా వైద్య, ఆర్ధిక వనరులు ఉన్నాయని చెప్పాడు. ఇపుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా భాధితులపైనే నా ఆలోచనలు ఉన్నాయని, భాధితుల సంఖ్యను తగ్గించే మార్గాన్ని కనుగొనాలని, మెక్‌కలమ్‌ ట్వీట్‌లో పేర్కోన్నాడు. కరోనా నివారణ చర్యలలో భాగంగలా న్యూజిలాండ్‌ ప్రభుత్వం అన్ని రకాల స్థానిక క్రికెట్‌ టోర్నీలను రద్దు చేసింది. పాఠశాలను, క్రికెట్‌ క్లబ్‌లను మూసివేసింది. అయితే విదేశాల నుంచి వచ్చేవారేవరైనా 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/