లోక్ సభలో అమరావతి అంశం లేవనెత్తిన గల్లా

అడ్డు తగిలిన వైఎస్‌ఆర్‌సిపి ఎంపిలు

TDP MP Galla Jayadev
TDP MP Galla Jayadev

న్యూఢిల్లీ: లోక్‌ సభలో టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ అమరావతి అంశంపై ప్రసంగించారు. 2015లో ఏపీ రాజధానిగా అమరావతిని నోటిఫై చేస్తూ ఇచ్చిన జీవోలో రాజధాని అన్నారు తప్ప రాజధానులు అనలేదని స్పష్టం చేశారు. విభజన చట్టంలోనూ ఒక రాజధాని అనే పేర్కొన్నారని వివరించారు. కానీ ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌సిపి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిందని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో కూడా వాళ్లు ఎక్కడా అమరావతిని మార్చుతామని చెప్పలేదని, వైసీపీ మేనిఫెస్టోలో మూడు రాజధానుల అంశం లేదని గుర్తు చేశారు. అయితే ఈ దశలో స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాన్ని పార్లమెంటులో ప్రశ్నించలేమన్న విషయాన్ని గౌరవ సభ్యుడు గుర్తించాలని హితవు పలికారు. ఈ దశలో పలుసార్లు వైసీపీ సభ్యులు గల్లా ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా నందిగం సురేశ్ తదితరులు గల్లా ప్రసంగాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించారు. అయితే గల్లా మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/