ఆలపాటి రాజా అరెస్టుపై గల్లా జయదేవ్‌ ఆగ్రహం

చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసులైనా తగిన మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరిక

Jayadev Galla
Jayadev Galla

అమరావతి: శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న ఆలపాటి రాజాను పోలీసులు అరెస్టు చేయడాన్ని టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ ఖండించారు. అమరావతి రైతులకు మద్దతుగా టిడిపి నేత ఆలపాటి రాజా ఈ రోజు తెనాలి నుంచి పాదయాత్ర చేయనున్న విషయం తెలిసిందే. ఉద్యమాన్ని బలహీనపరిచేందుకే వైఎస్‌ఆర్‌సిపి యత్నిస్తుందని ఆయన ఆరోపించారు. చట్టాన్ని అతిక్రమిస్తే పోలీసులైనా సరే తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన అన్నారు. శాంతిమార్గంలో పాదయాత్ర చేస్తున్న ఆలపాటిని పోలీసులు దాడి చేసి మరీ అరెస్టు చేయడం సరికాదని గల్లా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/