టిడిపి‌కి గల్లా అరుణకుమారి రాజీనామా

వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్టు వెల్లడి

Galla Aruna Kumari

అమరావతి: సీనియర్‌ నేత గల్లా అరుణకుమారి టిడిపి పొలిట్ బ్యూరో నుంచి వైదొలిగారు. ఈ మేరకు పార్టీ అధినాయకత్వానికి రాజీనామా లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పొలిట్ బ్యూరో నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. గతకొన్నిరోజులుగా టిడిపి అధినాయకత్వం కొత్త కమిటీల నియామకం జరుపుతోంది. ఇటీవలే పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్చార్జిలను కూడా నియమించింది. ఈ తరుణంలో అరుణకుమారి కీలక బాధ్యతల నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాతృమూర్తి అయిన గల్లా అరుణకుమారి 2014లో కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరారు. రాష్ట్రవిభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల ముందు నుంచి ఆమె పార్టీ కార్యకలాపాలకు కాస్త ఎడంగానే ఉంటున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/