25 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం జమ్మూకశ్మీర్‌లో 25 హైవే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దోడాలో ఆయా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రి వీకే సింగ్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఎంపీ జుగల్ కిషోర్ శర్మ హాజరుకానున్నారు.

గడ్కరీ పర్యటన నేపథ్యంలో గడ్కరీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసేందుకు వీకే సింగ్‌ జమ్మూకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న పనులను, ఇతర ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ 144ఏ, ఎన్‌హెచ్‌244 పనుల ప్రస్తుత స్థితిని, జడ్‌మోర్‌, జోజిలా టన్నెల పనుల వేగంపై ఆరా తీశారు. ఈ అలాగే జాతీయ రహదారుల హోదా పెంపునకు సంబంధించిన అంశాలపై చర్చించారు. కాశ్మీర్‌లో పర్యాటక రంగానికి ఉన్న అపారమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుని చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలకు అదనపు ప్రాజెక్టులను మంజూరు చేయాలని రోడ్డు, భవన నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలేంద్రకుమార్ కేంద్ర మంత్రిని కోరారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/