మధ్యాహ్న భోజనం ధరలు పెంపు

Madhyāhna bhōjanaṁ
Madhyāhna bhōjanaṁ

హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను రాష్ట్ర ప్రభుత్వమూ పెంచింది. వచ్చే నెలలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటి నుంచి పెంచిన ధరలతో భోజనం తయారు చేసి విద్యార్థులకు వడ్డించనున్నారు. మధ్యాహ్న భోజన ధర లు పెంచడంతో జిల్లాలో సుమారుగా 92 వేల మంది పేద విద్యార్థులకు మేలు జరగనుంది. వి ద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజన కార్మికుల కూ లాభం చేకూరనుంది. దీనికి సంబంధించి రా ష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే జీవో సైతం విడుదల చే సింది. మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సైతం లాభం చేకూరనుండడంతో సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/