‘భవిష్యత్ లో కాబోయే ప్రధాని స్టాలినే’

ఎన్నికల ప్రచార సభలో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ జోస్యం

Future Prime Minister Stalin-DMK leader Duraimurugan
Future Prime Minister Stalin-DMK leader Duraimurugan

Chennai:   భిన్న భాషలు,, సంస్కృతి, సంప్రదాయాలు కలిసి వున్న భారతదేశంలో వాటిని రూపుమాపేలా కేంద్రప్రభుత్వం పాలన చేస్తోందని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ విమర్సించారు. కేంద్రం అవలంభిస్తోన్న ఈ చర్యలను అడ్డుకునే ధీటైన నాయకుడు ఒకరు కావాలని దేశప్రజలు భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బర్గూర్‌ నియోజకవర్గ డీఎంకే అభ్యర్థ్ధి కి మద్దతుగా ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. పదేళ్లు మాత్రమే స్టాలిన్‌ ముఖ్యమంత్రి గా ఉంటారని, ఆ తర్వాత దేశ ప్రధాని అవుతారని‌ జోస్యం చెప్పారు. తాను చెప్పింది రాసుకోండి అని, రానున్న పదేళ్లలో స్టాలిన్‌ ప్రధాని అవుతారు అంటూ ఆయన జోస్యం చేప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/