సోలిమని అంతిమ యాత్రలోఆందోళనలు

soleimani funeral
soleimani funeral

బాగ్దాద్‌: శుక్రవారం తెల్లవారు జామున బాగ్దాద్‌ విమానాశ్రయంలో అమెరికా డ్రోన్‌ క్షిపణులతో దాడి చేసి ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిం సోలీమని హత్యగావించిన సంగతి తెలిసిందే. సోలీమని భౌతిక కాయానికి ఆదివారం వేలాది మంది అశ్రుతర్పణల మధ్య ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. ట్రంప్‌ అమానుష చర్యపై ఇరాక్‌ ఒక్కటే కాదు, యావత్‌ పశ్చిమాసియా ప్రాంతం ఆగ్రహంతో రగిలిపోతోంది. అమెరికా సైనిక దళాలను బహిష్కరించాలని ఇరాకీ ఎంపీలు పిలుపునిచ్చారు. ఈ హత్యకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద సంఖ్యలో బాగ్దాద్‌, తదితర ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి అమెరికా వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. సోలీమని హత్యతో అమెరికా తన మరణ శాసనాన్ని తానే లిఖించుకుందని ఇరాన్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/