‘పోలవరం’ ప్రాజెక్టుకు నిధుల వరం

భారీ సాయం, బకాయిల చెల్లింపునకు కేంద్రం సుముఖం…

2021 జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి చర్యలు

అమరావతి: పోలవరం ప్రాజెక్టు అవసరమైన అన్ని సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి కల్పిం చేందుకు కేంద్రప్రభుత్వం ముందుకు వచ్చింది. పెండింగ్‌లో వున్న నిధులతో పాటు, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యయంచేసిన నిధుల రీయింబర్సుమెంటు సుముఖతనువ్యక్తం చేసింది.

ఆ దిశలో చర్యలు వేగవంతం చేసింది.లభించిన సమాచారాన్ని పోలవరం ప్రాజెక్ట్‌ పరిధిలో పునరావాస వ్యయాన్ని చెల్లించడానికి, అందుకు అనుగుణంగా భూసేక రణకు సహకరించేందుకు కేంద్రం సానుకూల సంకేతాలను ఇచ్చింది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులకు సంబంధించి ఆర్దికమంత్రి బుగ్గన రాజేంద్రనాద్‌ ఢిల్లీలో పర్యటి స్తున్నారు. ఆయన కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జలశక్తి వనరు శాఖా మంత్రి గజేంద్రసింగ్‌ను కలుసుకున్న విషయం తెలిసిందే! పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.3,319.89 కోట్లను రీయంబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను ఎపి ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన ప్రతిపాదనలపై గజేంద్రసింగ్‌ షెకావత్‌ సానుకూలంగా స్పందించారు.

పోలవరానికి రూ.2, 156 కోట్లు రీయంబర్స్‌ చేయాలని పిపిఎ ప్రతిపాదనలు పంపిందని… వాటిని విడుదల చేయడానికి చర్యలు తీసు కుంటామని చెప్పారు.

రూ.1,163.89 కోట్ల రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి పిపిఎ నుంచి ప్రతిపాదనలు రాగానే.. ఆ నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత నెలలో పోలవరానికి రూ.1,850 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కేంద్ర ఆర్ధిక శాఖ జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్‌డబ్ల్యూడిఎ ద్వారా పిపిఎకు నాబార్డు నిధులు విడుదల చేశారు.

వాటిలో రూ.1,780 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి పిపిఎ విడుదల చేసింది. దీంతో కేంద్రం రీయంబర్స్‌ చేయాల్సిన బకాయిలు రూ.5,099.89 కోట్ల నుంచి రూ.3,319.89 కోట్లకు తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన బిల్లులపై ఆడిటింగ్‌ నిర్వహిస్తున్న పిపిఎ… మార్చి మొదటి వారంలో రూ.2,156 కోట్లు రీయంబర్స్‌ చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు సిఫార్సు చేసింది.

ఈ ఫైలుపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి యూపి సింగ్‌ ఆమోదముద్ర వేసి… ఆ శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకా వత్‌కు పంపారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన బుగ్గన రాజేంద్రనాధ్‌ కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/