స్నేహితులతో సరదాగా

కొన్ని సార్లు బాధ్యతలన్నీ నెత్తిన వేసుకుని విరామం లేకుండా చేసేస్తుంటాం. అన్నీ తామే చేయాలనుకుంటే అలసట, ఒత్తిడి గురి అవుతాం. అలా కాకుండా వారానికోసారి ఇంట్లో అందరికి బాధ్యతలు పంచాలి. దాంతో కొన్ని పనులు తగ్గుతాయి

. విశ్రాంతి తీసుకోవాలి. అలా అయితే తిరిగి వారమంతా ఉత్సాహంగా పనిచేసే శక్తి శరీరానికి అందుతుంది. ఇది మాటల్లో చెప్పినంత సులువు కాదు. కానీ అనుకుంటే ఆచరణలో పెట్టవచ్చు. అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రయత్నించాలి. అది ఉత్సాహాన్నే కాదు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

బాగా సన్నిహితులతో కాసేపు మాట్లాడాలి. వారితో కబుర్లు చెపితే అలసట, ఒత్తిడి దూరమై ఉల్లాసంగా ఉండగలుగుతాము. బాగా చికాకు పెడుతున్న అంశాలను రాసుకోవాలి. వాటిని ఒకసారి చదువుకోవాలి. సమస్య తెలుస్తుంది. పరిష్కారం దొరుకుతుంది. చిన్నప్పుడు కుట్లు, అల్లికలు, పెయింటింగ్‌ వంటివి ఎంతో సరదాగా చేసుంటారు. డాన్స్‌ నేర్చుకోవాలని ఉన్నా నేర్చుకోకపోవడం ఉంటుంది. అది ఇప్పుడు నేర్చుకునేందుకు ప్రయత్నించవచ్చు.

జిమ్‌కి వెళ్లడం, లేదా యోగా చేయడం వంటివి చేయవచ్చు. లేదా ఇంట్లోనే ఓ ట్రెడ్‌మిల్‌ ఏర్పాటు చేసుకుని హాయిగా పాటలు వింటూ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒత్తిడి, అలసటలను దూరం చేస్తాయి. ఎన్ని పనులున్నా కంటి నిద్ర నిద్రపోవాలి. నిద్రపోవడం వల్ల శరీరానికే కాదు, మెదడుకీ విశ్రాంతి అందుతుంది. ఒత్తిడి, కంగారు హుష్‌ కాకిలా ఎగిరిపోతాయి.

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/