ఫన్ టైటిల్ ఫిక్స్

బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహం

Actor Bellamkonda Srinivas

రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ గా రానున్న ఈ సినిమాకి ఫన్ టైటిల్ ను ఫిక్స్ చేసింది చిత్రబృందం.

‘అల్లుడు అదుర్స్’ అనే టైటిల్ పెట్టారు. పేరుకు తగ్గట్లుగానే సినిమాలో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఉంటుందట. గతంలో సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ ఫార్మాట్లో ఈ సినిమా ఉంటుందట.
ఇందులో కూడా ఇద్దరు కథానాయికలు నభ నటేష్, అను ఇమ్మాన్యుయేల్ నటించనున్నారు.

అలాగే అందులో ఒక కీ రోల్ చేసిన సోనూ సూద్ ఈ చిత్రంలో కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఇక ఫైట్స్ సంగతి సరేసరి. అన్నీ హైఓల్టేజ్ పోరాటాలే. రామ్, లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్న ఈ ఫైట్స్ కోసం పెద్ద మొత్తంలోనే ఖర్చు పెడుతున్నారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health/