గాంధీ: కరోనా ఐసోలేషన్‌ వార్డు నిండిపోయింది

Isolation ward in Gandhi Hospital
Isolation ward in Gandhi Hospital

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలోని కరోనా ఐసోలేషన్‌ వార్డు నిండిపోయింది. కరోనా వైరస్ అనుమానిత కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీంతో, హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి భారీ సంఖ్యలో అనుమానిత కేసులు వస్తున్నాయి. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ వార్డులో కేవలం 40 పడకలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్డు మొత్తం నిండిపోయింది. గత 40 గంటల వ్యవధిలో 50 అనుమానిత కేసులు గాంధీ ఆసుపత్రికి వచ్చాయి. ఈ నేపథ్యంలో, బెడ్ల కొరత ఏర్పడింది. దీంతో, పెయిడ్ రూమ్స్ ను కూడా ఐసొలేషన్ కోసం వినియోగిస్తున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/