రెండో రోజూ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరుగుదల

న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండో రోజు కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. ఫలితంగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు రూ. 110కి చేరుకోగా, డీజిల్ ధర రూ.96.36కి చేరుకుంది.

ఏపీలో పెట్రోలుపై 87 పైసలు, డీజిల్‌పై 84 పైసలు పెరిగింది. దీంతో గుంటూరులో లీటరు పెట్రోలు ధర రూ. 112.08కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 98.10కి పెరిగింది. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాలుగైదు నెలలపాటు స్థిరంగా ఉన్న పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ నిన్న చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/