నల్లబడని పండ్లు, కూరగాయలు

FRUITS
FRUITS

నల్లబడని పండ్లు, కూరగాయలు

ఆరోగ్యానికి పండ్లు మంచివని అందరికీ తెలుసు. పిల్లలకు పండ్లు వారి ఎదుగుదలకు దోహదం చేస్తుంది. మరి స్కూలుకు వెళ్లేటప్పుడు వారికి యాపిల్‌పండ్లు కోసి, ముక్కలు చేసి పెడితే అవి నల్ల బడతాయి. కొన్నిపండ్ల లో గింజలు తీసి, ఇస్తే అవికూడా పాడైపోతాయి. మరి పండ్లు నల్లబడ కుండా, గింజలు తీసినా పాడైపోకుం డా ఉండేందుకు శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. నల్లబడని యాపిల్‌, టమోటో, క్యారెట్లకు గులా బీరంగులోకి మార్చగలిగారు శాస్త్రవేత్త లు. మామూలుగా అయితే పైనాపిల్‌ లోపలి భాగం పసుపు రంగులో ఉం టుంది. కానీ పదిసంవత్సరాలకుపైగా కష్టపడి ఆ రంగును గులాబీవర్ణంలోకి మార్చగలిగారు శాస్త్రవేత్తలు.

నిజానికి టొమాటో, క్యారెట్లకు ఎరుపు వర్ణాన్ని చ్చే లైకోపీన్‌ పైనాపిల్‌లోనూ పుష్క లంగా ఉంటుంది. అయితే పైనాపిల్‌ పెరిగేకొద్దీ కొన్ని రకాల ఎంజైమ్‌లు లైకోపీన్‌తో చర్యజరిపి పండును పసు పు రంగులోకి మార్చేస్తాయి. అయితే ఆ ఎంజైమ్‌ల పెరుగుదలను తగ్గించడం వల్ల పైనా పిల్‌కు గులాబి వర్ణాన్ని తీసుకు రాగలిగారు. ఈ చర్యవల్ల పండు మరింత తియ్యదనాన్ని సంతరించు కుంటుంది. అంతేకాదు, పైనాపిల్‌ తినడంవల్ల అలర్జీకలిగించే బ్రొమిలిన్‌ అనే ఎంజైమ్‌ ఉత్పత్తినీ తగ్గించేసేలా ఇది తయారయింది.కాబట్టి ఈ పైనాపిల్‌ చూసేం దుకు ఆకర్షణీయంగా ఉండటమే కాదు మరింత రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. గోల్డెన్‌ రైస్‌.. బియ్యంలో పసుపు కలిపినట్టు కనిపిస్తు న్న ఈ పసుపు పచ్చని బియ్యాన్ని గోల్డెన్‌ రైస్‌ అని పిలుస్తారు. క్యారెట్ల లో కంటిచూపునకు పనికొచ్చే బీటాకెరోటిన్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ బీటాకెరోటిన్‌ మన శరీరంలోకి వెళ్లగానే విటమిన్‌-ఎగా మారుతుంది. అందుకే బియ్యంలో బీటాకెరోటిన్‌ అధికశాతం ఉండేలా ఈ గోల్డెన్‌ రైస్‌ను రూపొందించారు

శాస్త్రవేత్తలు. సాధా రణంగా క్యారెట్‌ సహా ముదురు పచ్చ ఆకుకూరలు, చిలగడదుంప తదితరాల్లాంటి వాటిలో మాత్రమే బీటాకెరోటిన్‌ పుష్కలంగా దొరుకుతుంది. అయితే పండ్లూ కూరగాయల కోసం అధికంగా ఖర్చు పెట్టలేని పేద దేశాలలో విటమిన్‌-ఎ లోపం కారణంగా పసివయసులో కంటిచూపును కోల్పోవడంతో పాటు చనిపోతున్న పిల్లల సంఖ్యా కోట్లలోనే ఉంది. అందుకే దక్షిణాసియా, ఆఫ్రికాల్లోని వివిధ దేశాల్లో ఈ పంటను ఇప్పటికే సాగు చేస్తున్నారు.
ఊదారంగులో టమోటో : ఎ
ర్రని రంగుకు భిన్నంగా టొమాటోను ఊదా రంగులో పండిస్తు న్నారు శాస్త్రవేత్తలు. లోపలి భాగం కూడా ముదురు ఊదా రంగులోనే ఉండే ఈ రకం టొమాటోల్లో ఆంథోసైనిన్లు అధికంగా ఉంటాయి. ఈ వర్ణద్రవ్యం పండ్లూ, కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికమొత్తంలో విడుదలయ్యేందుకు తోడ్పడుతుంది. అందువల్ల ఇలాంటి టొమాటోలను తినడం వల్ల అల్సర్లూ, క్యాన్సర్లతో పోరాడే శక్తి అధికమవు తుందట. అంతేకాదు ఆంథోసైనిన్లు టొమాటోల జీవితకాలాన్ని కూడా పెంచుతాయి. ఇవి మామూలు టొమాటోల కన్నా రెట్టింపు కాలం నిల్వ ఉంటాయట కూడా. మామూలుగా ఆపిల్‌ను ముక్కలు తరిగి పెడితే కాసేపటికే ఆ ముక్క ముదురుగోధుమ రంగులోకి మారిపోతుంది.

బంగాళాదుంపలను తరి గి కాసేపు ఉంచితే ఆముక్కలూ నల్లబడిపోవడాన్ని గమనిస్తూనే ఉంటాం.గాలిలోని ఆక్సిజన్‌ ముక్క ల్లోని పాలీఫినాల్‌ ఆక్సిడేజ్‌ (పీపీఓ) ఎంజైమ్‌ తో కలపడం వల్ల ఇలాజరుగుతుంది.అయితే ఈ ఎంజైమ్‌ తక్కువ ఉత్పత్తయ్యేలా అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఇరవై సంవత్సరాలు కష్టపడి ఈ ఆపిల్‌ను రూపొందించారు. పసుపు రంగులో ఉండే ఈ ఆపిల్‌ ఆర్కిటిక్‌ ఆపిల్‌ పేరుతో ఈ ఏడాదే ప్రపంచ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇదే తరహాలో కోసినప్పుడు నల్లబడని ఆలుగడ్డ్డలూ జనానికి అందుబాటులోకివస్తున్నాయి.

ఇవేకాదు, కొంచెం పైన్‌ ఆపిల్‌ రుచి ఉండే దక్షిణ అమెరికా చిలీ ప్రాంతానికి చెందిన ఒక రకం స్ట్రాబెర్రీలను, ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందిన మరో రకం స్ట్రాబెర్రీలతో కలిపి పైనాపిల్‌ రుచిని కలిగించే తెల్లటి స్ట్రాబెర్రీలను సృష్టించారు శాస్త్రవేత్తలు.
== ===