వేసవిలో పండ్లు మేలు

వేసవి కాలం వచ్చిందంటే వండిన ఆహారంకంటే పండ్లు, చల్లటి పానీయాలను తీసుకునేందుకే ఎక్కువమంది ఇష్టపడతారు. ఇది ఒకవిధంగా ఆరోగ్యానికి మంచిది కూడా. పండ్లు కడుపును చల్లగా ఉంచడం మాత్రమే కాక, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు.

Healthy Fruits
Healthy Fruits

మామిడిపండ్లు చాలా తియ్యగా ఉంటాయి. బత్తాయి కాస్త పుల్లగా, తియ్యగా ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇలా కొన్ని పళ్లలోనూ రుచుల్లో చాలా తేడాలుంటాయి. ఇలా ఎందుకు ఉంటాయి అంటే వాటిలో రుచికి కారణం రసాయనిక సంఘటనే. ఒకేజాతి పండ్లయినా పచ్చిరంగులో ఉన్నప్పుడు ఒకలా, బాగా మగ్గినప్పుడు మరొక రుచిని కలిగి ఉంటాయి. దీనికి కారణం పండ్లలో ఉండే చక్కెరశాతం. మిగిలిన పదార్థాల కన్నా చక్కెర శాతం ఎక్కువగా ఉంటే అవి తియ్యగా ఉంటాయి. ఆమ్ల గుణా లున్న పదార్థాలు సిట్రిక్‌ ఆమ్లం, లాక్టిక్‌ ఆమ్లం, ఆస్కార్బిక్‌ఆమ్లం ఎక్కువగా ఉంటే ఆ పండ్లు పుల్లగా ఉంటాయి. ఆల్కలాయిడ్లు, క్షార లక్షణాలు అధికంగా ఉండే పండ్లు వగరుగా అనిపిస్తాయి. ఆయా పండ్లలో రసాయనిక సంఘటన మీదనే రుచి, వాసన, రంగు, హారపు విలువలు అనేవి ఆధారపడి ఉంటాయి.