పట్టణాల నుంచి గ్రామస్థాయి వరకు అభివృద్ధి జరగాలి

venkaiah naidu
venkaiah naidu

అమరావతి: భారత దేశంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని, పట్టణాల నుంచి గ్రామస్థాయి అభివృద్ధి జరగాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పశ్చిమ గోదరావరి జిల్లా తాడేపల్లి గూడెం నీట్‌ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..వనరులు ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడమే మన పని అన్నారు. వ్యవసాయంపై అందరూ దృష్టిపెట్టాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఇంజనీర్లు తమ మేధాశక్తితో దేశ ప్రజల అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. దేశంలో ఆహార ఉత్పత్తి ఎలా పెంచాలో ఆలోచనలు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో నీళ్ల కోసం పోరాడే పరిస్థితి వస్తుందని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. ఆహార ఉత్పత్తిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని, కల్తీలేని విద్యుత్‌ అందించేలా పరిశోధనలు చేయాలని కోరారు. పరిశ్రమలతో పాటు పరిశుభ్రమైన వాతావరణం కూడా అవసరమన్నారు. ప్రతి ఒక్కరు మరొకరికి ఆదర్శంగా ఉండేలా మనల్ని మనం మలచుకోవాలని వెంకయ్యనాయుడు పలిలుపునిచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/