మంచి స్నేహితులుగా..

FRIENDS
FRIENDS

మంచి స్నేహితులుగా..

ఇతరులను స్నేహితులుగా చేసుకునే కళ చాలాపెద్ద కళ. చాలామంది వారిలో ఉన్న లోపాల కారణంగా ఎదుటివారిని శత్రువ్ఞలుగా తయారు చేసుకుంటారు. దాని పరిణామాల వల్ల మానసిక అశాంతి, ఇతరులతో శత్రుత్వాన్ని పెంచుకుంటారు. శత్రుత్వం కొని తెచ్చుకుంటారు. ఇప్పుడు ఇతరులను స్నేహితులుగా చేసుకునేందుకు మానవ్ఞడు తొమ్మిది గుణాలను అలవరుచకోవాలి. ే ఇతరుల పట్ల పవిత్ర ప్రేమ ే కలుపుగోలు మనస్తత్వం. నేను అన్న భావనను విడనాడాలి. ే సరళ స్వభావం లేదా మనసులో స్వచ్ఛత, సభ్యత, పరిశుభ్రంగా ఉండటం ే పవిత్రమైన ఉన్నత జీవితం ే

శాంతి స్వభావం. మధురత్వం, ప్రాధాన్యత గుణాలు ే దగ్గయ్యేందుకు సంబంధాలను పెంచుకునే లక్షణం ే ఇతరులకు సేవా సహాయతకు సిద్ధంగా ఉండాలి. ే ఇతరుల పట్ల కఠినమైన ఆలోచన చేయరాదు. వారిపై అట్టహాసం చేయరాదు. వారికి సముచిత గౌరవం, ప్రశంసను ఇవ్వడం, వారి మాటలను మన మనసులోవరకే ఉంచుకోవాలి. ే ఇతరుల కోసం మనం సుఖం, సౌఖ్యాలను త్యాగం చేసేందుకు సిద్ధం కావాలి. ఇప్పుడు అందరూ అంగీకరించేది ప్రేమ మాత్రమే. శత్రువ్ఞలను మిత్రునిగా మార్చేందుకు ఒక మంత్రంలా పనిచేస్తుంది. లేదా మనిషి ఒక మనిషి మనసు ఇతరుల మనసు స్వేచ్ఛాపూర్వకంగా కట్టిపడేసేందుకు ఒక సూత్రంలా పనిచేస్తుంది. ఉన్నతంగా ప్రేమసాగరుడైన పరమాత్మ ప్రేమధార ప్రవహించాలి. అప్పుడే ప్రేమజాగృతమౌతుంది. స్వయంగా మిమ్మల్ని మీరు ప్రేమ స్వరూప పరమాత్మ సంతానంగా నిశ్చయించుకుని ప్రేమ విభునిగా ఇతరులతో కలియతిరుగుతారు. కాని పరమాత్మను ప్రేమించడం, పరమాత్మ సంతానం ఉంటే దాని అర్థం మనుష్య ఆత్మలనూ ప్రేమించమని ఇతరులతో కలుపుగోలుగా మెలగాలని బోధిస్తుంది. ఇది ఎప్పుడు సాధ్యమౌతుందంటే మనుష్యులు పరస్పరం అభిమానపు భావాలుండాలి. వారిని మనస్ఫూర్తిగా ప్రేమించాలి.

వారితో ఆత్మతో మన ఆత్మ అన్నదమ్ముల బంధంగా అంగీకరించాలి. ఇది యొగంలో ఒక భాగమే. ఇదేవిధంగా ఇతరులతో మన బంధాన్ని పవిత్రంగా, అనురాగంతో ఉంచుకోవాలి. ఆ సంబంధాన్ని పటిష్టంగా ఉంచడం ఆ బంధాన్ని కొనసాగిం చడం ఎప్పుడు సాధ్యం అవ్ఞతుంది అంటే ఎప్పు డైతే మనుష్యులు ఎల్ల ప్పుడు తమ ఆలోచనలకు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. తమగురించే కాక ఇత రుల అభిప్రాయాన్ని ప్రాధాన్యంలోకి తీసుకుని గౌరవించినపుడు మాత్రమే ఇది సాధ్యం. ఈ విషయాలన్నీ యొగం ద్వారా మాత్రమే సాధ్యం. యొ గం ద్వారా మాత్రమే మానవ్ఞలు పరస్పర ఐక్యంగా ఉండగలరు. యొగం యొక్క అర్థం కలిసిమెలస ఉండటమని లేదా ఏకత్వంలో భిన్నత్వాన్ని కలిగి ఉండటమని లేదా మనం అందరం ఒక్కటే అన్న భావన కలిగి ఉండాలి. ఇక మానవ్ఞల మధ్య మృధుస్వభావం, సభ్యత, స్వచ్ఛత వంటి గుణాలు ఉండాలి. ఎందుకంటే స్నే హం దృఢ నిలవాలంటే స్వ చ్ఛత, సభ్యత దోహదం చేస్తుంది. మానవ్ఞల జీవితం లో పవిత్రత, శాంతస్వభావం ఉంటే వారిని మరింత ఆకర్షణీ యంగా తయారుచేస్తుంది. మాన వ్ఞల జీవితంలో పరమాత్మ స్మృతిలో ఉన్నప్పుడు మాత్రమే శాంతి, పవిత్రత లభిస్తుంది. రహస్య స్నేహితుడు ఉంటాడు. స్నేహితునికి దగ్గరగా ఉండటం,స్నేహాన్ని నిలుపు కోవడం,స్నేహాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఆర్థికంతో ముడి పడే స్నేహాలు, ప్రలోభాలకు అవసరాలకు ఏర్పడే స్నేహాలు తా త్కాలికం. మనహితం కోరే స్నేహితుడు మనకు లభించడం మన కు వరం. ఆ వరమైన స్నేహాన్ని కాపాడుకుందాం. పరస్పర స్నేహభావనతోనే జాతీయతను సాధిద్దాం