శ్రేష్టమైన పానీయాలు

‘ఊపిరి ఉంటే ఉప్పు నీరు తాగి బతకొచ్చుఅనేది పాత సామెత. డబ్బులుంటే కూల్‌డ్రింక్‌లతో బతకొచ్చన్నది నేటి వాస్తవం. మార్కెట్ మాయాజాలమా అని అడుగడుగునా వేలరకాల కూల్డ్రింకులు అందుబాటులో ఉన్నాయి. కొబ్బరి నీరు, చెరుకు రసాల్లో కూడా వీటిని కలిపి తాగేస్తున్నారు. వాటితో రోగాలొచ్చి తొందరగా ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా డ్రమ్ములకు డ్రమ్ములు లాగించేస్తున్నారు. నేడు గ్రామాల్లో తాగునీరు దొరకడం కష్టమవ్ఞతుంటే కూల్‌డ్రింక్‌లు, మినరల్‌వాటర్, మద్యం మాత్రం బాగా దొరుకుతోంది. వ్యాపారులు సంవత్సరానికి మినరల్వాటర్తో 50వేల కోట్లు, కూల్‌డ్రింక్‌లతో లక్షకోట్లు, మద్యంతో లక్షల కోట్లు సంవత్సరానికి టర్నోవర్ చేసేస్తున్నారు. దీనివల్ల జరిగే ప్రయోజనం ఆయుష్షు తరగడమే తప్ప ఆరోగ్యసూత్రం సున్నా. ఆయుర్వేద శాస్త్రంలో యుక్తిని ఉపయోగించి ఆరోగ్యాన్ని పొందండి అని సూచించారు.
అంటే మన జ్ఞానంతో కొత్త విధానాలను మనమే కనుక్కుని ఆరోగ్యాన్ని పొందడానికి తగిన విధంగా ఆహారాన్ని, ఔషధాన్ని తయారుచేసుకొని వాడుకోవాలని అర్థం. అయితే నేటి విజ్ఞానం అంతా ఆరోగ్యం పట్ల ఉపయోగపడటం లేదు. ఏది అనారోగ్యాన్ని తెస్తుందో, ఏది తొందరగా ప్రాణాలను తీస్తుందో అలాంటి వాటిని కనుక్కోవడానికి యుక్తి ఉపయోగపడుతోంది. దాని వెనకున్న రహస్యం ఆదాయమే కాని ఆరోగ్యం కాదు కదా! చక్కని ఔషధ మూలికలతో పానీయాలు తయారుచేసుకుని తాగుతుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, ఆయుష్షు పెరుగుతుంది. ”పసలేని పానీయాలకన్నా పళ్ళరసాలు మిన్న అన్న చందంగా మీకు అందుబాటులో ఉండే వాటితో ఆరోగ్య పానీయాలు తయారుచేసుకుని తాగండి. ఆరోగ్యాన్ని పొందండి.
ఎండిన బ్రాహ్మి ఆకులు రెండు తీసుకుని వాటిని రెండు కప్పుల నీటిలో వేసి మరిగించి, దానిలో చిదమాలి. ఇలా చిదిమిన ద్రాక్ష నీటిని వడగట్టి తేనె లేదా పాలు+చక్కెర కలిపి తాగాలి. ఈ పానీయం చలవ చేస్తుంది.
స్వల్ప విరేచనకారి. అతిదాహం తొలగుతుంది. జ్వరం ఉన్నప్పుడు దీన్ని తాగితే ఒళ్లు చాలా చలాకీగా ఉంటుంది. అరుచిపోతుంది. జ్వరంలో ఉండే వంటి వేడి తగ్గి మూత్ర విసర్జన తేలికగా జరుగుతుంది. డయాబెటిస్, రక్తం తక్కువగా ఉన్నవారు దీన్ని రోజూ తాగాలి. పిల్లలకు లివర్ సమస్య ఉంటే దీన్ని తాగడం వల్ల అది నయం అవ్ఞతుంది. మూత్రకృచ్ఛ వ్యాధి తగ్గుతుంది.
నల్లశారిబ వేళ్లపై బెరడు తీసి ఐదుగ్రాముల వేళ్లను 200ఎం.ఎల్ నీటిలో వేసి మరిగించి, దానికి పాలు చక్కెర కలిపి తాగాలి. రక్తం తగ్గి ముఖం పాలిపోతుంటే ఈ పానీయాన్ని రోజూ తాగాలి. సాధారణ బలహీనత, చర్మవ్యాధులు, అజీర్ణం అరుచి పోతాయి. రోజు టీ, కాఫీ తాగడానికి బదులుగా ఈ పానీయాన్ని తాగాలి. సుగంధ పాల వేర్ల బెరడు ఐదుగ్రాములను 200ఎంఎల్ నీటిలో వేసి గంటసేపు మరిగించిన తర్వాత దాన్ని వడగట్టి చల్లార్చి కొద్దిగా పటికెబెల్లం కలిపి రోజు రెండు పూటలా తాగాలి. రక్తవృద్ధి అవ్ఞతుంది. చలువచేస్తుంది. శరీరానికి రంగునిస్తుంది.
దీన్ని తయారుచేయడానికి కావలసినవి తాజా తులసి ఆకులు-20 మిరియాలు-10, శొంఠి కొద్దిగా, పాలు-100ఎం.ఎల్, చాలినంత చక్కెర, గ్లాసుడు నీళ్లు. ముందుగా తులసి ఆకులను మిరియాల పొడిని శొంఠిని నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు వేడిచేయాలి. దీన్ని వడగట్టిన తర్వాత పాలు చక్కెర కలిపి టీ మాదిరిగా తాగాలి. ఈ పానీయం తాగడం వల్ల జలుబు, మలేరియా, లేదా మామూలు జ్వరం తగ్గిపోతాయి. అజీర్ణం తొలగుతుంది. ఒకవేళ తాజా తులసి ఆకులు లభించకపోతే ఎండిన ఆకులను కూడా వాడవచ్చు.
గుండెదడ తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి, బిపి అదుపునకు అర్జున చెట్టు బెరడు రసానికి తేనె లేదా పటికబెల్లం కలిపి తాగాలి. దీన్ని రోజూ సేవిస్తే గుండెబలం కలుగుతుంది. 5గ్రాముల అశ్వగంధ వేర్లు చూర్ణానికి చెమ్చా చక్కెర, నెయ్యి కలిపి రోజూ తినాలి. దీన్ని పాలల్లో వేసుకుని చక్కెర కలిపి తాగవచ్చు. ఇది నరాల బలానికి చాలా మంచి టానిక్. జ్వరాలు, ఇతర జబ్బులు వచ్చి నరాల బలహీనత కలిగి నప్పుడు తిరిగి బలాన్ని పుంజుకోవడానికి దీన్ని తాగాలి. అశ్వగంధ వేర్లను తొలుత పాలల్లో మరిగించి శుభ్రపరిచిన తర్వాత ఎండబెట్టి చూర్ణం చేసి వాడాలి. వీర్య వృద్ధికి, ధాతుపుష్టికి రోజూ రెండు చెమ్చాల ఆవ్ఞనెయ్యిలో చెమ్చాడు చక్కెర కలిపి వాడాలి.