గూగుల్‍కు రూ.1954 కోట్లు జరిమానా

ఫ్రాన్స్ నియంత్రణా సంస్థ వెల్లడి

Google
Google

గూగుల్‍ సంస్థకి 22 కోట్ల యూరోలు (రూ.1954 కోట్లు) జరిమానా విధించారు.ఈ మేరకు ఫ్రాన్స్ నియంత్రణా సంస్థ వెల్లడించింది. పోటీతత్వాన్ని దెబ్బతీసేలా గూగుల్‍ కంపెనీ వెబ్‍ సర్వీసెస్‍ అక్రమంగా గూగుల్‍ అడ్వర్టయిజింగ్‍ సర్వర్‍కి బిజినెస్‍ పంపుతున్నట్టు వచ్చిన ఆరోపణలు నిజమేనని దర్యాప్తులో తేలడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఆన్‍లైన్‍ డిస్‍ప్లే వాణిజ్య ప్రకటనలను ఉపయోగించి సంక్లిష్టమైన ఆర్గారథమిక్‍ వేలం పక్రియలను ఎదుర్కోవడం ప్రపంచంలోనే మొదటిదని , గూగుల్‍ లబ్ది పొందేందుకు అడ్దదారులు తొక్కిందని ఫ్రెంచ్‍ కాంపిటీషన్‍ అథారిటీ పేర్కొంది. కాగా . ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించడానికి గూగుల్‍ కూడా అంగీకరించింది. ఇదిలా ఉండగా , 2019లో రూపర్ట్ మర్దోక్‍ న్యూస్‍ కార్పొరేషన్‍, ఫ్రాన్స్ పత్రిక, బెల్జియం మీడియా గ్రూపులు గూగుల్‍పై కేసు పెట్టాయి.. పరిస్థితిని చక్కదిద్దేందుకు యాడ్‍ మేనేజర్‍ సర్వీసులను మెరుగుపరుస్తామని గూగుల్‍ హామీ ఇచ్చింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/