భారీ నిరసనలతో దద్దరిల్లుతున్న ఫ్రెంచ్‌

French cities
French cities

పారిస్‌ : ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమాన్యుయెల్‌ మాక్రాన్‌ తలపెట్టిన పెన్షన్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా నెల క్రితం ఆరంభమైన ప్రజా ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతూ పతాకస్థాయికి చేరుకుంటోంది. ఈ ఉద్యమంలో భాగంగా జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఫ్రాన్స్‌లోని వివిధ నగరాలలో వేలాది మంది ప్రజలు తమ నిరసనలతో హోరెత్తించారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో జరిగిన నిరసన ప్రదర్శనల్లో దాదాపు 13 లక్షల మందికి పైగా కార్మికులు, యువత పాల్గొన్నట్లు కార్మిక సంఘాల లెక్కలు చెబుతున్నాయి. పారిస్‌లో దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించగా, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసి, 18 మందిని అరెస్ట్‌ చేశారు. మార్సెల్లీ, లియాన్‌, బోర్డాక్స్‌, టౌలూస్‌ తదితర నగరాల్లో వేలాదిమంది ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/