గుజరాత్‌లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

గత రెండు రోజులుగా గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు అన్ని చెరువులు ఉప్పొంగిపోతున్నాయి. ఈ క్రమంలో ఫిరోజ్‌న‌గ‌ర్ నుంచి ఖుర్దా రోడ్‌కు వెళ్తున్న స‌రుకు ర‌వాణా రైలు.. ఒడిశాలోని అంగుల్ రైల్వేస్టేష‌న్ దాటిన త‌ర్వాత తాల్చేర్ రోడ్‌కు రెండు కిలోమీట‌ర్ల దూరంలో ప‌ట్టాలు త‌ప్పింది. ఈ తెల్లవారు జామున 2:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది వ్యాగన్లు నదిలో పడ్డాయి.

రైలింజిన్ పూర్తిగా పక్కకు ఒరిగిపోయంది. వ్యాగన్లన్నీ ఒకదాని మీద ఒకటి పడి నుజ్జునుజ్జు అయ్యాయి. గోధుమల లోడును తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో జోరుగా వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాల వల్ల బ్రిడ్జి కింద ప్రవహిస్తోన్న నందీరా నది పొంగిపొర్లుతోంది. అదే సమయంలో పట్టాలు తప్పడం వల్ల తొమ్మిది వ్యాగన్లు నదిలో పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదని ఈస్ట్‌కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు.