జియో కస్టమర్లకు హాట్‌స్టార్‌లో క్రికెట్‌ మ్యాచులు

JIO
JIO

టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ను అందిస్తుంది. ఐసిసి వరల్డ్‌కప్‌ 2019 టోర్నీ నేపథ్యంలో హాట్‌ స్టార్‌లో క్రికెట్‌ మ్యాచులను ఉచితంగా లైవ్‌లో చూసే అవకాశం కల్పించింది. అందుకుగాను జియో కస్టమర్లు రూ. 251 ప్యాక్‌ను రీచార్జి చేసుకోవాలి. దీంతో జియో టివి యాప్‌ ద్వారా హాట్‌ స్టార్‌ యాప్‌లో మ్యాచులను ఉచితంగా చూడొచ్చు. కాగా రూ. 251 ప్యాక్‌తో కస్టమర్లకు 51 రోజుల పాటు రోజుకు 2 జిబి డేటా చొప్పున మొత్తం 102 జిబి డేటా ఉచితంగా లభిస్తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/