శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తునికి ఉచిత లడ్డు

Tirupati Laddu
Tirupati Laddu

తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సంవత్సరం సందర్భంగా తీపి కబురు కానుకగా అందించింది. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తునికి ఉచిత లడ్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం టీటీడీ దేవస్థానం ప్రకటించింది. ఇంతకు ముందు కేవలం కాలినడకన వచ్చే భక్తులకు మాత్రమే ఉచిత లడ్డును అందించేవారు. ఇపుడు అందరికీ ఉచిత లడ్డును ఇవ్వనున్నారు. అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 6 నుంచి ఈ ఉచిత లడ్డు కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించనుంది. కాగా తిరుపతి దేవస్థానం ప్రస్తుతం రోజుకు 20 వేల లడ్డూలను అందిస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా అందరికీ ఉచిత లడ్డుతో కలిపి 80 వేల లడ్డూలను ఇవ్వనుంది. ఇక అదనంగా లడ్డులు కోరే భక్తులకు ప్రస్తుతం ఉన్న ధరకే లడ్డూలు ఇస్తామని తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/