ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

న్యూఢిల్లీ: ఢిల్లీలో మహిళలు ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేలా అవకాశాన్ని కల్పించినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. మహిళల భద్రతకు 13 వేల మంది మార్షల్స్‌ను నియమించామని ఆయన అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభుత్వ బస్సుల్లో (ఢిల్లీ ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్) మహిళలు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఉచితంగా ప్రయాణించవచ్చని కేజ్రీవాల్ చెప్పారు. బస్సుల్లో ప్రయాణించడానికి మహిళలకు ఉచిత అవకాశాన్ని కల్పిస్తామని కేజ్రీవాల్ గతంలోనే హామీ ఇచ్చారు. మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశంపై ఆగస్టు 29వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. మహిళల ఉచిత ప్రయాణానికి రవాణా శాఖకు రూ.479 కోట్లు ప్రత్యేక నిధులు ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ బస్సుల్లోనే కాకుండా మెట్రో రైళ్లలోను మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
తాజా చెలి వార్తల కోసం క్లిక్ చేయండి.. https://www.vaartha.com/specials/women/