ఐఐటి విద్యార్థులకు ఉచిత సాయం

IIT Students (File)

సాంకేతిక రంగంలో ప్రతిభ చూపాలంటే పైథాన్‌ నుంచి బిగ్‌డేటా వరకు ప్రాథమికాంశాలైనా నేర్చుకోవాల్సిందే. ఈ విధంగా కంప్యూటర్‌ సైన్స్‌లో నైపుణ్యాలు మెరుగుపరచు కోవాలని చాలామంది ఆశిస్తుంటారు. వీరికి ఆన్‌లైన్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐఐటి బాంబే ఈ క్రమంలో కొత్తగా ఏడు కోర్సులనూ, ఢిల్లీకి చెందిన ఎకోవేషన్‌ మూడు కోర్సులనూ ప్రవేశపెట్టాయి. ఆసక్తి ఉన్నవారు వీటిని ఉచితంగానే అభ్యసించవచ్చు.

కంప్యూటర్‌ సైన్స్‌రంగంలోని ప్రాథమిక అంశాలు నేర్చుకోవటం ఈ రోజుల్లో తప్పనిసరి అయిపోయింది. వాటిని ప్రామాణికంగా నేర్చుకుంటే అడ్వాన్స్‌డ్‌ కోర్సుల్లో చేరి ఇట్టే అల్లుకుపోవచ్చు. వీటిని ఆన్‌లైన్‌లో అనుకూలమైన వేళల్లో నేర్చుకోవచ్చు. ఫీజు చెల్లింపులతో నేర్చుకునే కోర్సులున్నప్పటికీ, కొన్ని ప్రయోజనకరమైన కోర్సులను మాత్రం ఉచితంగానే అందిస్తు న్నాయి. దేశంలోని పురాతన సంస్థల్లో ఐఐటి బాంబే ఒకటి. పరిశోధన ప్రోగ్రామ్‌లు, నాణ్యమైన విద్యాపరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కూడా పొందింది. దేశంలోకెల్లా ఈ సంస్థల్లో ప్రవేశాన్ని పొందడం కష్టంగా భావిస్తుంటారు. జెఇఇ లో ఎంతో మంచి ర్యాంకు సాధించినవారికే ఇక్కడ సీటు సాధ్యమవుతుంది. ఇక్కడ బోధన రెండు విధాలుగా ఆన్‌లైన్‌, తరగతి బోధనల్లో ఉంటుంది.

తమను తాము సాంకేతికంగా తీర్చిదిద్దుకోవాలనుకునేవారికి ‘ఐఐటి బాంబే ఎక్స్‌ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనిలో పలురకాల కోర్సులను అందుబాటు లో ఉంచింది. ఐఐటి బాంబేఎక్స్‌ ఉచిత ఆన్‌లైన్‌ వేదిక. విద్యార్థులకూ, ప్రొఫెషనల్స్‌కూ వారి కెరియర్‌లోని వివిధ దశల్లో తోడ్పడేలా ఈ వేదిక ఎడ్యూమూక్స్‌ను అందిస్తోంది. దీంతో ప్రధానమైన 7 ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ కోర్సులను ఎంపిక చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచింది.

ఇంట్రడక్షన్‌ టూ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌:

అల్గారిథమ్‌ రీతిలో కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లోని ప్రాథమిక భావనలను నేర్చుకుంటారు. ఇది విద్యార్థులను ప్రోగ్రామ్‌లను రాయడం లో, ప్రయోగాత్మక గణన సమస్యలను పరిష్కరించడంలో ప్రోత్సహిస్తుంది. ఇది 6 వారాల కోర్సు. నేర్చుకోవాలను కునేవారు వారానికి 4 గంటలనే కేటాయించాలి.
ప్రోగ్రామింగ్‌ బేసిక్స్‌: దీనికి ఇంట్రడక్షన్‌ టూ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌కు సంబంధించి చాలా అంశాలను నేర్చుకుంటారు. ఇది 9 వారాల కోర్సు. నేర్చుకోదల్చినవారు వారానికి 6-8 గంటలు కేటాయించాల్సి ఉంటుంది.

ఫౌండేషన్‌ ఆఫ్‌ డేటా స్ట్రక్చర్స్‌:

ప్రభావవంతమైన ఆర్గారిథమ్స్‌ను రూపొందించడానికి, నిర్వహణయోగ్యమైన సాఫ్ట్‌వేర్లను నేర్చుకోవడానికి డేటా స్ట్రక్చర్స్‌ తప్పనిసరి. కోర్సులో భాగంగా నంబర్స్‌ వంటి ప్రాథమిక డేటా టైప్స్‌ను కూడా నేర్చుకుంటారు. ఆపై సమర్థమైన స్ట్రక్చర్లను రూపొందించడనికి, నిర్వహించడానికి అవసరమైన కాన్సెప్చువల్‌ ప్రేమ్‌వర్క్‌ను ఏర్పరచుకుంటారు. ఇది ఆరు వారాల కోస్సు. నేర్చుకోవాలనుకునేవారు వారానికి 6 నుంచి 8 గంటల సమయాన్ని కేటాయించాల్సిఉంటుంది.

ఆర్గారిథమ్స్‌:

భవిష్యత్తుంతా దీనిదే. దీనిలో భాగంగా న్యూమరికల్‌, స్ట్రింగ్‌, జామెట్రిక్‌, గ్రాఫ్‌ అల్గారిథమ్స్‌, ఇతర వాటిని నేర్చుకుంటారు. విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి సరైన డేటా స్ట్రక్చర్లను ఉపయోగించి అలార్గరిథమ్స్‌ను ఎలా ఉపయోగించొచ్చు నేర్చుకుంటారు. ఇది ఆరువారాల కోర్సు. నేర్చుకోవాలనుకునేవారు వారానికి కనీసం 6 నుంచి 8 వారాల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.

టెక్నికల్‌ స్కిల్స్‌:

సాంకేతిక పరిశ్రమలో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఈ కోర్సు చాలా ఉయోగపడుతుంది. పైథాన్‌ నుంచి బిగ్‌డేటా వరకు అన్నింటికి సంబంధించిన బేసిక్స్‌ను నేర్చుకుంటారు. ‘హౌస్టాక్‌ ఎక్ఛేంజ్‌ వర్క్స్‌ అనే ఒక కేస్‌స్టడీపైనా పనిచేస్తారు. ఇది నాలుగు వారాల కోర్సు.

ఇంప్లిమేంటేషన్‌ ఆఫ్‌ డేటాస్ట్రక్చర్స్‌:

సి++కు ప్రతిరూపం లాంటి ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ను ఉపయోగించి అన్ని మేజర్‌ డేటా స్ట్రక్చర్లను ఎలా అమలు చేయొచ్చో నేర్చుకుంటారు. ‘ఫౌండేషన్స్‌ ఆఫ్‌ డేటాస్ట్రక్చర్స్‌ కోర్సుతో దీనికి దగ్గరి సంబంధం ఉంటుంది. ఇది 6 వారాల కోర్సు. వారానికి 6 నుంచి 8 గంటలు కేటాయించాల్సి ఉంటుంది. వీటిని ఒక సమయంలో ఒక్కదాన్నేచేయాలనే నిబంధనేమీ లేదు. విద్యార్థి తన అనుకూలతను బట్టి, ఒకే సమయంలోని ఎన్ని కోర్సులను చేయాలనేది ఎంచుకోవచ్చు. లెక్చర్లు, అసైన్‌మెంట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఉంటే విద్యార్థికి తనకు సమయం అందుబాటులో ఉన్నపుడు వీడియోలు చూడటం, చదవడం, ఇచ్చిన ఎసైన్‌మెంట్‌ పూర్తిచేయడం వంటివి చేసుకోవచ్చు. కోర్సులు లేదా ఏదైనా విషయానికి సంబంధించి సందేహాలు ఎదురైనపుడు వెబ్‌సైట్‌లోని ‘డిస్కషన్‌ ఫోరంలో అడగొచ్చు.ఈ కోర్సులకు ‘రీ టేక్‌ అవకాశం కూడా ఉంటుంది. తీసుకున్న ప్రతిసారీ సర్టిఫికేషన్‌ లభిస్తుంది. కోర్సు పూర్తయ్యాక కూడా మెటీరియల్‌ అందుబాటులో ఉంటుంది. విద్యార్థి డాష్‌బోర్డులో ఆర్కైవ్స్‌లో దీన్ని తిరిగి పొందొచ్చు.

ఎకోవేషన్‌లో:

ఐఐటి ఢిల్లీ పూర్వవిద్యార్థులు రితేష్‌సింగ్‌, ఆక్షత్‌ గోయల్‌ దీనిని 2015లో స్థాపించారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా విద్యార్థులూ, ఉపాధ్యాయులూ, ఉద్యోగులూ, సంస్థలను ఒక తాటిపైకి తెస్తోంది. వీరిందరికీ ఈ కోర్సుల్లోకి ప్రవేశించే వీలు ఉంటుంది. ఎప్పటిప్పుడు మార్కెట్‌ పరిశోధన చేసి, అందుకు తగ్గట్టుగా కోర్సులను రూపొందిస్తు న్నారు.

దీంతో విద్యార్థులు కొత్త ట్రెండ్‌లూ, సంస్థల అవస రాలూ తెలుసుకుని తగిన నైపుణ్యాలను అందుకోగలు గుతారు. కోర్సులు చేసేవారు వెబ్‌, అప్‌..రెండు పద్ధతుల నూ ఉపయోగించుకోవచ్చు. ఉచిత ఆప్‌ను ఆప్‌స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తీర్చిదిద్దారు. కేవలం కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌లకే పరిమితం కాకుండా క్యాబ్‌, ఎన్‌ఎన్‌సి, ఐఐటి జెఇఇ, యూపిఎస్‌సి, బ్యాంకు పివో మొదలైన వాటిని ఉచిత లర్నింగ్‌ గ్రూపులనూ అందిస్తున్నారు

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/